భారత్ లో బాల్య వివాహాలు.. బయటపడ్డ సంచలన నిజాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

భారత్ లో బాల్య వివాహాలు.. బయటపడ్డ సంచలన నిజాలు

child marriages in india : మనదేశంలో బాల్య వివాహాలు కొత్తేమి కాదు. నాలుగైదు దశాబ్దాల పూర్వము 90 % వరకు అన్ని బాల్య వివాహాలే జరిగేవి. అయితే దేశము అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న క్రమంలో బాల్య వివాహాల వలన కలిగే అనర్దాలు ఏమిటో తెలియటం ద్వారా చాలా వరకు అవి తగ్గాయి. వాటిని తగ్గించటం కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకోని వచ్చాయి. కానీ తాజాగా యూనిసెఫ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం […]

 Authored By brahma | The Telugu News | Updated on :11 March 2021,5:01 pm

child marriages in india : మనదేశంలో బాల్య వివాహాలు కొత్తేమి కాదు. నాలుగైదు దశాబ్దాల పూర్వము 90 % వరకు అన్ని బాల్య వివాహాలే జరిగేవి. అయితే దేశము అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న క్రమంలో బాల్య వివాహాల వలన కలిగే అనర్దాలు ఏమిటో తెలియటం ద్వారా చాలా వరకు అవి తగ్గాయి. వాటిని తగ్గించటం కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకోని వచ్చాయి. కానీ తాజాగా యూనిసెఫ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది.

child marriages in india sensational facts that came out

child marriages in india sensational facts that came out

బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇథియోపియా, భారత్, నైజీరియా దేశాల్లో 30 నుంచి 35 కోట్ల మంది మహిళలకు 18 కంటే తక్కువ వయసు ఉన్నప్పుడే వివాహం జరిగిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా కూడా బాల్యవివాహాలు మళ్లీ ఒక్కసారిగా పెరిగే అవకాశమున్నట్టు యూనిసెఫ్ అంచనా వేస్తోంది. అయితే ఇది ఇక్కడితో ఆగిపోవడం లేదు.. రానున్న మరో రెండు దశాబ్దాల కాలంలో పది కోట్ల మంది మైనర్ బాలికలకు వివాహం జరిగే అవకాశమున్నట్టు హెచ్చరించింది యూనిసెఫ్. అత్యంత ఆధునిక 21వ శతాబ్దపు తొలినాళ్లలో చైల్డ్ మ్యారేజెస్ కు సంబంధించిన ఈ వార్త మనదేశంలో సంచలనం స్రుష్టించింది.

గత ఏడాది కాలంగా కోవిడ్19 కారణంగా మూతపడిన పాఠశాలలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రులు చనిపోవడం, గర్భం రావడం లాంటి వాటితో దేశంలో చైల్డ్ మ్యారేజెస్ గణనీయంగా పెరిగాయి. కరోనా కొట్టిన దెబ్బకు జనంలో అనేక మార్పులు కనిపించాయి. వీలైనంత తొందరగా బాధ్యతలు ముగించుకోవాలని అనుకునే పేరెంట్స్ తమ పిల్లలకు పెళ్లిల్లు చేసేసారు.

child marriages in india sensational facts that came out

child marriages in india sensational facts that came out

ప్రస్తుతం పెళ్లి చేసేందుకు పెద్దగా ఖర్చు కూడా అవసరం లేకపోవడంతో జనం ఈ దిశగా నిర్ణయిం తీసుకుంటున్నారని యునిసెఫ్ వెల్లడించిన నివేదిక తెలుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనజీవితాలను అతలాకుతలం చేసిన కరోనా… పేద కుటుంబాల్లోని బాలికల ఆశలనూ దారుణంగా చిదిమేసింది. ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడాలని వారు కన్న కలలు ఆవిరవుతున్నాయి. కరోనా వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులైన స్థితిలో తల్లిదండ్రుల మాటను అమ్మాయిలు కాదనలేక పెళ్లిపీటలెక్కుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలతో వివాహాల ఖర్చులు కూడా తగ్గిపోవడంతో కొందరు తల్లిదండ్రులకు ఇదో చక్కని అవకాశంగా మారింది.

తమ వివాహం నచ్చని బాధితురాళ్లు లేదా ఇరుగు పొరుగు వారిచ్చే సమాచారంతో కొన్ని సంఘటనలు మాత్రమే బయటకు తెలుస్తున్నాయి. కరోనా వైరస్ బాలికల ఆశలను చిదిమేసింది… బాల్యానికి పసుపుతాడు రూపంలో పలుపుతాళ్లు పడుతున్నాయి. బాల్యవివాహాల నిరోధ చట్టం – 2006 పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.ఇప్పటివరకు ఉన్న చట్టాల మేరకు వారికి చక్కని ఆరోగ్యం, చదువుకోవడం అనే ప్రాథమిక హక్కులుంటాయి. వివాహం అవడంతోనే ఇవన్నీ రద్దయిపోతాయి.

వీటి వల్ల ప్రత్యక్షంగా బాలికపై, పరోక్షంగా కుటుంబం ఆపై సమాజంపై ప్రభావం పడుతోంది. తెలిసీ తెలియని వయసులో వారిపై కుటుంబ బాధ్యతలు మీదపడటంతో అనారోగ్యాలకు గురవుతున్నారు. చిన్న వయసులోనే కుటుంబాన్ని నడిపించడం కోసం వయసుకు మించిన ఉద్యోగాలతో జీవన పోరాటం చేయక తప్పడం లేదు. తెలిసీ తెలియనివయసులోనే అమ్మాయిలకు గర్భం రావడంతో పాటు హెచ్ఐవీ లాంటివి సోకుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతీ ఒక్కరూ దీనినో సామాజిక బాధ్యతగా తీసుకుని బాల్యవివాహాలను వ్యతిరేకించడం చేయాలి. బాలికల నుంచి వారి బాల్యం దొంగిలించబడకుండా చూడాలి. ప్రభుత్వాలు బాల్యవివాహాల నిరోదం కోసం వెంటనే సత్వర చర్యలకు ఉపక్రమించాలి.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది