CCA పౌరసత్వ సవరణ చట్టం.. ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోండి..!
ప్రధానాంశాలు:
CCA పౌరసత్వ సవరణ చట్టం.. ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోండి..!
CCA : దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులోకి వచ్చిన నేపథ్యంలో, దరఖాస్తుల స్వీకరణకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ఇండియా సిటిజన్‌షిప్ ఆన్‌లైన్ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు త్వరలో సీఏఏ-2019 పేరుతో మొబైల్ యాప్‌ను కూడా త్వరలో తీసుకొస్తామని హోంశాఖ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఎn్గానిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారతదేశ పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 2014 డిసెంబర్ 13కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులకు సీఏఏ చట్టం వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాల జాబితాలో మునుపటి పాస్‌పోర్టు, జనన ధ్రువీకరణ పత్రం లేదా ఇతర గుర్తింపు పత్రాలు (మాతృదేశాలు జారీచేసినవి) సమర్పించాల్సి ఉంటుంది. అలాగే 2014 డిసెంబర్ 31కి ముందే భారత్‌లోకి ప్రవేశించారని రుజువుచేసే డాక్యుమెంట్లు ఇవ్వాలి. వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్ స్టాంప్, భారత్‌లో జారీచేసిన రేషన్ కార్డు, ఒకవేళ ఇక్కడే జన్మిస్తే బర్త్ సర్టిఫికెట్, రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంట్, పాన్‌కార్డు, విద్యుత్ బిల్లులు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, వివాహ ధ్రువీకరణ పత్రాలు ఇలా ఏదైనా గుర్తింపు పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
సీఏఏ వెబ్ పోర్టల్‌కి వెళ్లాలి. ఇందులో భారత పౌరసత్వం దరఖాస్తుల బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆపై మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌చేసి తదుపరి పేజీలోకి చేరుకోవాలి. అక్కడ పేరు, ఈమెయిల్ ఐడీ ఇతర వివరాలు నమోదు చేయాలి. వివరాల్ని సరిచూసుకున్న తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కాలి. దీంతో మెయిల్, మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ధ్రువీకరించిన తర్వాత అదనపు వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఈ పక్రియ పూర్తయిన తర్వాత మీ పేరుతో లాగిన్ అయి కొత్త దరఖాస్తు బటన్ నొక్కడం ద్వారా, వ్యక్తిగత వివరాలను ఇవ్వడం ద్వారా దరఖాస్తు చేసుకోవడం పూర్తవుతుంది. ఇదిలావుండగా, పౌరసత్వ సరవణ చట్టం-2019 అమలును సవాల్ చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయూఎంఎల్) అభ్యంతరం వ్యక్తంచేసింది. దీని అమలును నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2019లోనూ దీనిపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఐఎంయూఎల్, నిబంధనలు నోటిపై చేయకుండా చట్టం అమలు చెల్లదంటూ అప్పట్లో న్యాయపోరాటం చేసింది. అయితే ఇప్పుడు నిబంధనలు నోటిఫై చేయడంతో, అసలు చట్టానికున్న రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ మంగళవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
CCA విపక్షాల రుసరుసలు
సీఏఏ అమలుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల ముందు అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. సీఏఏ అమలు ప్రకటన కాషాయపార్టీ లూడో గేమ్‌లో భాగమని అభివర్ణించారు. బెంగాల్‌లోని హబ్రాలో జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్న దని ఆరోపించారు. సీఏఏ మీకు #హక్కులు కల్పిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ మీరు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న మరుక్షణం అక్రమ వలసదారులుగా మారి మీ #హక్కులను కోల్పోతారు. నిర్బంధ శిబిరాలకు తరలించబడతారు. దయచేసి దరఖాస్తు చేసే ముందు ఆలోచించండి అని ఆమె అన్నారు. పౌరసత్వం పొందని వారి ఆస్తులు ఏమవుతాయని ప్రశ్నించారు. సీఏఏ చట్టబద్ధతపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచార ప్రయత్నమని మండిపడ్డారు. సీఏఏ అమలు ఎన్‌ఆర్‌సీతో ముడిపడివుంది. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి. బెంగాల్‌ను విభజించేందుకు బీజేపీ కొత్త గేమ్‌ను మొదలు పెట్టింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వం అని మమతా బెనర్జీ నొక్కిచెప్పారు.

CCA : పొరుగు శరణార్థులకు భారత పౌరసత్వం.. ప్రధాన నిబంధనలు ఏమిటో తెలుసా..?
తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా పౌరసత్వ (సవరణ) చట్టాన్ని వ్యతిరేకించారు. ఇది ఆమోదయోగ్యం కాదని, రాష్ట్రంలో అమలును అనుమతించవద్దని తమిళనాడు ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. పౌరులు సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 వంటి చట్టం ఆమోదయోగ్యం కాదు. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేయదని హామీ ఇవ్వాలని కోరారు. మరొక సౌత్ స్టార్, కమల్ హాసన్ కూడా దీన్ని తప్పుబట్టారు. ఎన్నికలకు ముందు ప్రజలను విభజించడానికి, భారతదేశ సామరస్యాన్ని నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఈ చర్యను తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామన్న విశ్వాసం బీజేపీకి లేదని, ఇందుకు సీఏఏ అమలు ప్రకటనే నిదర్శనమని అన్నారు. ఇది 2019లో ఆమోదించబడింది. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు కొద్ది రోజుల ముందు నోటిఫై చేయడం ద్వారా బీజేపీ తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. రామ మందిరం నిర్మాణం తర్వాత కూడా తమ స్థానం బల#హనంగా ఉందని భావించి ఈ కొత్త ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మతాన్ని ప్రయోగించాలని అనుకుంటున్నట్లు స్పష్టమవుతోందని అబ్దుల్లా అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు వ్యతిరేకంగా మంగళవారం అసోంలో నిరసనలు చెలరేగాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలతోపాటు సీఏఏ చట్టం ప్రతులను ద#హనం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ ఆందోళనలకు నాయకత్వం వహించగా, అసోమ్ జాతీయతబాది యుబా చత్ర పరిషత్ (ఎజెవైసిపి) లఖింపూర్‌లో ప్రధాన మంత్రి, #హూం మంత్రి దిష్టిబొమ్మలను ద#హనం చేసింది. వివిధ కళాశాలల విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివసాగర్ జిల్లాలో రైజోర్ దళ్, కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి, ఛత్ర ముక్తి పరిషత్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ వివాదాస్పద చట్టాన్ని నిరసిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శివసాగర్, గోలాఘాట్, నాగోన్, కమ్రూప్ వంటి కొన్ని జిల్లాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, 30 రాజకీయేతర స్వదేశీ సంస్థలు టార్చ్‌లైట్ మార్చ్ నిర్వహించాయి. బుధవారం నుండి సత్యాగ్రహాన్ని ప్రారంభించనున్నాయి