Konda Surekha : కొండా సురేఖ నోటి దూల‌పై హైకమండ్ సీరియ‌స్.. రాజీనామా త‌ప్ప‌దా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Konda Surekha : కొండా సురేఖ నోటి దూల‌పై హైకమండ్ సీరియ‌స్.. రాజీనామా త‌ప్ప‌దా?

Konda Surekha : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్‌ వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చిన కొండా సురేఖ‌పై ప్ర‌తి ఒక్క‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాజకీయంగా ఒకరిని ఇరుకున పెట్టాలని చూసి వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరచి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలో ఆమె చిక్కుకుపోయారు. తప్పుడు ఆరోపణలు.. అసంబంధ విషయాలపై తీవ్ర ఆరోపణలు చేసిన కొండా సురేఖ ప‌ద‌వికి ఇప్పుడు పెద్ద గండం కూడా ఏర్ప‌డిందని స‌మాచారం.. రహాస్య సంభాషణలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 October 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Konda Surekha : కొండా సురేఖ నోటి దూల‌పై హైకమండ్ సీరియ‌స్.. రాజీనామా త‌ప్ప‌దా?

Konda Surekha : బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్‌ వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చిన కొండా సురేఖ‌పై ప్ర‌తి ఒక్క‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాజకీయంగా ఒకరిని ఇరుకున పెట్టాలని చూసి వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరచి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలో ఆమె చిక్కుకుపోయారు. తప్పుడు ఆరోపణలు.. అసంబంధ విషయాలపై తీవ్ర ఆరోపణలు చేసిన కొండా సురేఖ ప‌ద‌వికి ఇప్పుడు పెద్ద గండం కూడా ఏర్ప‌డిందని స‌మాచారం.. రహాస్య సంభాషణలు ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా విని వారిని బెదిరించి.. డ్రగ్స్‌కు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశారని మంత్రిగా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Konda Surekha రాజీనామా చేయ‌నుందా ?

తనకు రాజకీయంగా హైప్‌ క్రియేట్‌ చేస్తాయని భావించగా.. ఉల్టా ఆమెకు తీవ్ర ప్రతికూలంగా మారాయి. తెలుగు రాష్ట్రాలే కాదు యావత్‌ దేశం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఆరోపణలతో నోటికొచ్చినట్టు మాట్లాడే కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె తీరు పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రత్యర్థి పార్టీల నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఒక బాధ్యతయుతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం మన రాజకీయాలను ఎటువైపు తీసుకు వెళుతుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు.

Konda Surekha కొండా సురేఖ నోటి దూల‌పై హైకమండ్ సీరియ‌స్ రాజీనామా త‌ప్ప‌దా

Konda Surekha : కొండా సురేఖ నోటి దూల‌పై హైకమండ్ సీరియ‌స్.. రాజీనామా త‌ప్ప‌దా?

ఇదే విష‌యంలో ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ – అమల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమల తమ కుటుంబం సురేఖ వ్యాఖ్యలతో ఆవేదనలో ఉన్నట్లు వివరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ కంట్రోల్ కు పార్టీ అధినాయకత్వం టీపీసీసీ నేతలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ, సినీ పరిశ్రమ మాత్రం చర్యలకు డిమాండ్ చేస్తోంది.పార్టీ హైకమాండ్ మంత్రి పదవికి సురేఖతో రాజీనామా చేయించాలని టీపీసీసీకి సూచించినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. పదవి నుంచి తొలిగించకుండా.. సురేఖ తనంతటగా తానే రాజీనామా చేసేలా ఒప్పించాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల‌లోనే దానిపై పూర్తి క్లారిటీ రానుంద‌ని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది