Janasena Bjp : బీజేపీలో జనసేన విలీనం కాబోతుందా.. పవన్ సనాతనం వెనక స్కెచ్ ఇదేనా..!
ప్రధానాంశాలు:
Janasena Bjp : బీజేపీలో జనసేన విలీనం కాబోతుందా.. పవన్ సనాతనం వెనక స్కెచ్ ఇదేనా..!
Janasena Bjp : పది సంవత్సరాలు కష్టపడినందుకు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఈ సారి అనేక స్థానాలలో గెలిచి తన సత్తా చాటింది. అయితే పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎంగా పదవి దక్కడంతో ఇప్పుడు ఆయన పూర్తిగా ప్రజల సేవలో ఉన్నారు. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు..దేశమంతా కలకలం రేపాయి. హిందూవుల మనోభావాలకు సంబంధించింది అయినందున ఆందోళన నెలకొంది. ఇదే అదనుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో సనాతన అవతారం ఎత్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో సనాతన డిక్లరేషన్ చేయడం ఆ పార్టీకు మైలేజ్ తెచ్చిపెట్టిందని కొందరి వాదన.
Janasena Bjp సరికొత్త స్కెచ్..
పవన్ కళ్యాణ్ సనాతన అవతారం అలవోకగా చేపట్టింది కాదని..దీని వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. అందుకే తిరుమల లడ్డూ కల్తీపై ఆధారాల్లేవని సుప్రీంకోర్టు చెప్పినా పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి సభలో సనాతన వ్యాఖ్యలు తీవ్రం చేశారు. సనాతనం పాటించేవారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని, ధర్మాన్ని వ్యతిరేకించేవారికి న్యాయస్థానాలు సైతం రక్షణ కల్పిస్తున్నాయని చెప్పడం ఇందుకు ఉదాహరణ. అంతేకాకుండా దేశంలో సనాతనం పరిరక్షణకు ఓ వ్యవస్థ ఉండాలని ప్రకటించారు. ఇక పవన్ సనాతనం వెనక బీజేపీ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీ విలీనం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో జనసేన విలీనం అవుతుందని… అయితే జెమిలి ఎన్నికలు నిర్వహించే ముందే ఇది జరుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. జాతీయ మీడియాలో కూడా దీనిపైన ప్రత్యేక కథనం కూడా వచ్చింది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో నిలదొక్కుకోవాలని ఎప్పట్నించో భావిస్తున్న బీజేపీకు పవన్ కళ్యాణ్ ఓ ఆయుధం కావచ్చని తెలుస్తోంది. అందుకే చాలాకాలంగా జనసేన-బీజేపీ విలీన ప్రతిపాదన నడుస్తోంది. ఒకవేళ జమిలి ఎన్నికలు సంభవిస్తే..అప్పటిలోగా విలీనం పూర్తి చేయాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖచిత్రం కానున్నారు. ఇక పవన్‌కి కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా నడుస్తుంది.