MLA Janardhana Rao : దమ్ముంటే రా అంటూ వైసీపీ నాయకుడి వార్నింగ్..నీళ్లు తాగిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే చురక..!
ప్రధానాంశాలు:
MLA Janardhana Rao : దమ్ముంటే రా అంటూ వైసీపీ నాయకుడి వార్నింగ్..నీళ్లు తాగిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే చురక..!
MLA Janardhana Rao : వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మధ్య మాటల తూటాలు పేలుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తనను ఉద్దేశించి బాలినేని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే దామచర్ల. ఎన్నికలు ముగిసిన అనంతరం పారిపోయి.. ఇప్పుడు బాలినేని ఒంగోలు వచ్చారని ఆయన అన్నారు. బాలినేని.. జనసేన లేదా టీడీపీలో చేరాలని భావించారని, కుదరకపోవడంతో మళ్లీ ఒంగోలుకు వచ్చారని విమర్శించారు. నేను గెలిచి కరెక్ట్ గా నెల రోజులు కాలేదు అప్పుడే బాలినేని మాటలు ఏంటి? అని మండిపడ్డారు.
mla janardhana rao ఆగు.. తొందరెందుకు?
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తన మీద పగ తీర్చుకోవాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాలు విసిరారు. అంతేగానీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎదురు తిరగాలని అనుకుంటే తమ వాళ్లు ఏమీ తక్కువగా లేరని తెలిపారు. జనసేన నాయకులతో కలిసి తనపై వ్యతిరేకంగా ఒంగోలులో ప్లెక్సీలు వేయిస్తున్నారని అన్నారు. వాటిపై స్పందించిన దామరచర్ల.. ఒంగోలులో బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి అక్రమాలు, అరాచకాలు చేయబట్టే ప్రజలు ఆగ్రహంతో తీర్పు ఇచ్చారు. వయసులో పెద్దవాడు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నప్పుడు గంజాయి బ్యాచ్ తో టీడీపీ కార్యకర్తలపై దాడి చేయించింది నీవు కాదా? ఎన్నికల ప్రచారంలో మహిళపై దాడి చేయించింది నీ కోడలు కాదా?
అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడేం చేస్తావో చూస్తా. ఒరేయ్, వీడు, వాడు అంటూ ఏకవచనం చేసి మాట్లాడితే ఎక్కిన కొవ్వు దించుతా. ఇంకోసారి ఒరేయ్ అను. నీ సంగతి చూస్తా. బాలినేని విల్లాలో పక్కా అవినీతి జరిగింది. ఐరన్ ఓర్ గ్రావెల్ ఫ్రీగా ఎలా తోలావు. చిల్లర చేష్టలు చేసి ఆ తప్పులను ఇతరులపై నెట్టేస్తావా? నీ కొడుకు డబ్బులు వసూలు చేసి మళ్లీ ఇతరులను బెదిరిస్తావా? గ్రానైట్, ఇసుక క్వారీల్లో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా? వైజాగ్ లో ఎక్కడ భూములు కొన్నావో, ఎక్కడ ఏమేం దాచి పెట్టావో.. ఒంగోలులో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. వాటన్నింటినీ బయటకు తీస్తాం. మీరు చేసిన అక్రమాలు, అరాచకాల జోలికి రాకూడదంటే అధికారులు ఊరుకోరు. అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్డునే మళ్లీ వేయడం రంగులు వేయడం తప్ప నీవు ఒంగోలుకు చేసిందేమీ లేదు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులే అయ్యింది. కొద్దిగా ఓపిక పట్టు. నీకు మంచి నీళ్లు కూడా తాగిపిస్తా. తొందరెందుకు నీకు..? అప్పటివరకు రెస్ట్ తీసుకో. అని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు