మేం సంపాదించేది మా బిడ్డలకు ఒక్కపూట తిండి పెట్టలేక‌పోతున్నాం.. పూట భోజనానికి రూ. 1500 కావాలి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మేం సంపాదించేది మా బిడ్డలకు ఒక్కపూట తిండి పెట్టలేక‌పోతున్నాం.. పూట భోజనానికి రూ. 1500 కావాలి..!

 Authored By anusha | The Telugu News | Updated on :5 December 2023,7:30 pm

ప్రధానాంశాలు:

  •  మేం సంపాదించేది మా బిడ్డలకు ఒక్కపూట తిండి పెట్టలేక‌పోతున్నాం.. పూట భోజనానికి రూ. 1500 కావాలి..!

పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. బట్టల మిల్లులో పనిచేస్తున్న అసిఫ్ మాసి కుటుంబం దైనందిన జీవితం దుర్భరంగా మారింది. రేపు పొద్దున్న ఇంత అన్నం దొరికేందుకు దారి చూపమని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటా అని మాసీ చెప్పారు. పాకిస్తాన్లో మొత్తం బట్టల మిల్లు మూడోవంతు అంటే సుమారు 1600 మిల్లులు మూతపడ్డాయి. దీనివలన ఏడు లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయి. ఇలాంటి లక్షల మందిలో 45 ఏళ్ల మాసీ కూడా ఒకరు. గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్స్ కు బట్టలు సరఫరా చేసే ఒక ఫ్యాక్టరీలో చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ మూత పడింది. దీంతో ఆయన చిన్న చిన్న పనులు చేస్తూ ఆటో రిక్షా నడుపుతున్నారు. లాహోర్ లోని పారిశ్రామిక వాడలోని సింగిల్ రూమ్ అపార్ట్మెంట్లో మాసి కుటుంబం జీవిస్తున్నారు. పాకిస్థాన్ లో పెరుగుతున్న జీవన వ్యయాలు తమని తమ ఐదుగురు పిల్లలను ఎంత ప్రభావితం చేస్తాయో ఆయన తెలిపారు.

మాసీ ఆయన భార్య ఎక్కువసేపు పనిచేసే తమ ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు పోషిస్తున్నారు. ఒక పూట గడవడం కష్టంగా ఉండడంతో పిల్లలు బడికి కూడా వెళ్లడం లేదు. ప్రతిరోజు 500 పాకిస్తానీ రూపాయలతో ఎలాగో నెట్టికొచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఒక పూట భోజనం కోసం 1500 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని మాసీ చెప్పారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ తాకిడితో రోజు గడవని స్థితిలో లక్షలాదిమంది ఉన్నారు. పాకిస్తాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, కరెంటు చార్జీలు కూడా విపరీతంగా పెరగడంతో చాలామంది నిరసన వ్యక్తం చేశారు కూడా. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి శంషాద్ అక్తర్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మరిన్ని నిధులు కోరినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది.

గ్యాస్ ధరలను అమాంతం పెంచినవి తగ్గించక పోతే పరిశ్రమలను మూసివేస్తామని కరాచీలోను పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో నిత్యవసరాలు ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అదనపు ఆదాయం సంపాదించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతుల కారణంగా సబ్సిడీలను ప్రభుత్వం దశలవారీగా తగ్గించడంతో సామాన్యులు కష్టాలు పెరిగాయి. ఇటీవల కాలంలో గోధుమపిండి, బియ్యం ధరలు రెండింతలు అయ్యాయి. ఇది ఆర్థిక వినాశనంగా పాకిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి యుక్త ఇస్మాయిల్ అభివర్ణించారు. ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి తరువాత ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. దీనికి తోడు పాకిస్తాన్ లో తలెత్తిన ఆర్థిక సమస్యల కారణంగా 1600 బట్టల మిల్లులు మూతపడ్డాయి. గతేడాది విరుచుకుపడ్డ వరదల కారణంగా 1700 మంది పైగా ప్రజలు మరణించారు. వ్యవసాయ భూములు భారీగా ముంపుకు గురయ్యాయి.

పాకిస్తాన్లోని విభిన్నమైన భౌగోళికతో యువత ఎక్కువగా ఉండడంతో పెట్టుబడిదారులకు ఈ దేశం ఆకట్టుకునేలా ఉంది. ప్రత్యేకించి కార్మికులు భారీ ఎత్తున అవసరమయ్యే వస్త్రాలు, ఆటోమొబైల్ రంగాలకు పాకిస్తాన్ కేంద్రంగా ఉంది. రుణాలు చెల్లించాల్సి ఉండగా దిగుమతి బిల్లులు భారీగా పెరిగిపోతుండడంతో పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీ నిల్వలు 300 కోట్ల డాలర్ల కంటే దిగువకు పడిపోయాయి. పాకిస్తాన్ మిత్ర దేశాలైన చైనా, సౌదీ అరేబియా, యూఏఈ కూడా పాకిస్తాన్ విదేశీ నిల్వలు పోకుండా ఉండేందుకు చేస్తున్నారు. చైనా పాకిస్తాన్ కి ఆర్థిక వ్యవస్థలో బిలియన్ డాలర్ల పెట్టుబడులను కురిపించింది. చైనా అతి పెద్ద విదేశీ పెట్టుబడి తో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుందని భావిస్తున్నారు. చైనా పెట్టుబడి ఆశాజనకంగానే ఉంది కానీ ఆ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని దీంతో చైనా కు రుణాలను తిరిగి చెల్లిస్తామని అంటున్నారు. చైనా లాంటి ఉక్కు సోదరుడి మద్దతుతో పాటు ఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి పాకిస్తాన్ ఆర్థిక బాధ్యత ఉంటుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది