Tirupathi SP : తిరుపతి పరిస్థితి అదుపులోనే ఉంది… నిందితుడు ఎవరైనా సరే అరెస్టు చేస్తాం.. ఎస్పీ కృష్ణ కాంత్..!
Tirupathi SP : ఆంధ్రప్రదేశ్ లో నిన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని పై జరిగిన దాడి ఘటన తిరుపతిలో చర్చనియాంశంగా మారింది. ఇక ఈ దాడి ఘటన పై ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన పద్మావతి మహిళా వర్సిటీ కి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలాన్ని పరీక్షించిన అనంతరం కృష్ణ కాంత్ మీడియాతో మాట్లాడుతూ…దాడిలో గాయపడిన పులివర్తి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. అలాగే అతనికి ఎలాంటి ప్రాణహాని లేదని భద్రంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని , ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద మరింత భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా ఆయన వెల్లడించారు.
అలాగే ప్రస్తుతం పరిస్థితి మొత్తం పూర్తిగా తమ అదుపులో ఉందని ఈ ఘటనకు పాల్పడిన నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అయితే మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గ కూటమి మీ అభ్యర్థి పులివర్తి నాని పై వైకాపాశ్రేణులు దాడికి తెగబడ్డారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు పులివర్తి నాని వెళ్లి వస్తుండగా వైకాపా నేతలు నాని పై దాడి చేశారు. ఇక ఈ ఘటనలో పులివర్తి నాని భద్రత సిబ్బందికి కూడా తీవ్ర గాయాలు కాగా ఆయన కారు పూర్తిగా ధ్వంసం అయింది.
Tirupathi SP అసలేం జరిగిందంటే…
దాదాపు 150 మందికి పైగా వైకాపా కార్యకర్తలు కత్తులు రాళ్లు ,రాడ్లు పట్టుకుని వచ్చి దాడి చేశారని తెదేపా నేతలు తెలియజేస్తున్నారు. అయితే ఈ దాడి నడవలూరు సర్పంచి గణపతి ఆధ్వర్యంలో చోటు చేసుకుందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనను చెవిరెడ్డి పిరికిపంద చర్యగా కొనియాడారు. ఓటమి భయంతోనే వారు దాడులకు దిగుతున్నారని చెప్పుకొచ్చారు. దాడికి పాల్పడినటువంటి వైకాపా నేతలను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అప్పటివరకు ఆందోళన విరమించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.