Venu Swamy : ట్రెండింగ్ వీడియో.. జగన్ తో కారులో వేణుస్వామి భేటీ.. అసలు సీక్రెట్ తెలిస్తే.. !
Venu Swamy : వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజమే అయ్యాయి. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటారని ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టే వారు విడిపోయారు. దాంతో పాటు హీరోయిన్లకు స్టార్ డమ్ రావడం కోసం కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు వేణుస్వామి. అంతే కాకుండా సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ఆయనకు […]
ప్రధానాంశాలు:
Venu Swamy : ట్రెండింగ్ వీడియో.. జగన్ తో కారులో వేణుస్వామి భేటీ.. అసలు సీక్రెట్ తెలిస్తే.. !
Venu Swamy : వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పిన వాటిల్లో చాలా వరకు నిజమే అయ్యాయి. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటారని ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టే వారు విడిపోయారు. దాంతో పాటు హీరోయిన్లకు స్టార్ డమ్ రావడం కోసం కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు వేణుస్వామి. అంతే కాకుండా సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ఆయనకు బాగా అలవాటు. ఇక చంద్రబాబు గురించి కూడా ఆయన గతంలో చెప్పారు.
Venu Swamy వీడియో ట్రెండింగ్..
2023లో చంద్రబాబు కొన్ని ఇబ్బందులు పడుతారని చెప్పారు. ఆయన చెప్పినట్టు గానే ఆయన స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఇక జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవుతారని.. 2024లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని గతంలోనే వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పింది నిజమే అవుతుందని అటు వైసీపీకూడా పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ఇక ఏపీలో ప్రస్తుతం పోలింగ్ అయిపోయింది. ఈ సందర్భంగా జగన్ రీసెంట్ గానే ఐ ప్యాక్ తో భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన ఓ వీడియో బాగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
ఓ కారులో సీఎం జగన్ తో వేణుస్వామి ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇద్దరూ కలిసి ఏదో విషయంపై బాగా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. వేణుస్వామి కూడా ఏదో తన ఫోన్ లో చూపిస్తున్నాడు. జగన్ ముసిముసి నవ్వులు కురిపిస్తున్నాడు. ఈ వీడియోను చూసిన వారంతా జగన్ మరోసారి వేణుస్వామిని కలిశాడా అని అంటున్నారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. గత నాలుగేండ్ల క్రితం 2019లో జగన్, వేణుస్వామి కలిసి ప్రయాణించిన వీడియో ఇది. దీన్ని మరోసారి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అయితే ఈ వీడియోను చూసిన టీడీపీ, జనసేన నాయకులు వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నారు. రెండోసారి జగన్ సీఎం అవుతారని వేణుస్వామి చెబతున్నాడని.. ఆయన జగన్ మనిషే అంటూ ఏకిపారేస్తున్నారు.
వైరల్ అవుతున్న సీఎం జగన్ తో ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి వీడియో
ఈ వీడియోను తన సోషల్ మీడియా పోస్ట్ చేసిన వేణు స్వామి pic.twitter.com/X81Ok4y5Yu
— greatandhra (@greatandhranews) May 15, 2024