Lionel Messi : లియోనెల్ మెస్సీ మన ఇండియా వాడేనంటూ కాంగ్రెస్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Lionel Messi : ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులకు, ముఖ్యంగా మెస్సీ అభిమానుల ఆనందం ఇప్పుడు అంతా ఇంతా కాదు. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుకు ప్రపంచ కప్ అందించినన లియోనెల్ మెస్సీ అంతా తానై జట్టును నడిపించి దేశానికి మూడో ట్రోఫీని అందించి అర్జెంటీనా ప్రజల ఆనందం అవధులు దాటేలా చేశాడు. ఈ కప్ సాధించటంతో మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆటగాళ్ల లిస్టులో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇప్పుడు ఈ అర్జెంటీనా స్టార్ ఖాతాలో లేని ట్రోఫీ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే కొద్ది రోజుల క్రితం ఇదే తన చివరి ప్రపంచకప్
అని మెస్సీ ఇప్పటికే ప్రకటించగా, ఫుట్ బాల్ ప్రేమికులు నిరాశకు గురయ్యారు.ఇక తమ అభిమాన ఆటగాడిని మైదానంలోని చూడలేమని వారు భావించగా, తాను ఇప్పట్లో రిటైరవ్వను అని స్వయంగా మెస్సీనే చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటింది. అయితే మెస్సీకి సంబంధించిన వార్తలు ఇప్పడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. మెస్సీ నాయకత్వంలో తొలి వరల్డ్ కప్ అర్జెంటీనా సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా అతనిపై ప్రశంసల వర్షం కురరుస్తుంది. రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ చేసిన ఒక ట్వీట్ మాత్రం మరింత వైరల్ అయింది.
Lionel Messi : అవునా.. ఇది నిజమా ?
వరల్డ్ కప్ గెలవడంపై లియోనెల్ మెస్సీకి కంగ్రాట్స్ చెబుతూ.. అస్సాంతో నీకు అనుబంధం ఉన్నందుకు గర్వంగా ఉందంటూ.. అస్సామ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిఖ్ తన ట్వీట్‌లో పేర్కోన్నారు. అక్కడితే ఆగకుండా అస్సాంలోనే పుట్టాడని ట్వీట్ చేయగా, ఈ ట్వీట్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కొద్ది సేపటికే ఆయన తప్పుని తెలుసుకున్నాడో ఏమో కాని డిలీట్ చేశాడు. కాని అప్పటికే కొందరు స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీని కొందరు విమర్శిస్తుండగా, మరి కొందరు మాత్రం వెనకేసుకొస్తుండడం విశేషం.