Phonepe : ఫోన్ పే లేదా గూగుల్ పేల నుండి డబ్బులు వేరే నెంబర్‌కి పోయాయా.. తిరిగి పొందడం ఇలా..!
ప్రధానాంశాలు:
phonepe : ఫోన్ పే లేదా గూగుల్ పేల నుండి డబ్బులు వేరే నెంబర్‌కి పోయాయా.. తిరిగి పొందడం ఇలా..!
phonepe : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా ఆన్‌లైన్ చెల్లింపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొబైల్ ఉంటే వెంటనే డబ్బులు కొట్టేస్తున్నారు. పది రూపాయలకు కూడా యూపీఐని వాడటం అలవాటు అయింది. అయితే చెల్లింపులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తప్పుడు నెంబర్లకు కూడా చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు డబ్బును తిరిగి ఎలా పొందడం అనే ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి.నగదు బదిలీకి ఎంతో సులభమైన మార్గం అయినప్పటికి.. కొన్ని సందర్భాల్లో అనుకోని పొరపాట్లు చేస్తుంటారు. ఒక నెంబర్‌కు బదులు మరొక నెంబర్ ఎంటర్ చేయడం లేదా.. యూపీఐ ఐడి తప్పుగా ఎంటర్ చేయడం వంటివి సహజంగా చేస్తుంటారు. అలాంటి సమయాల్లో మన డబ్బులు పోయినట్లే అని చాలా మంది బాధపడుతూ ఉంటారు.
phonepe ఇలా చేయండి..
తప్పుడు యూపీఐ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తే.. మీరు మీ డబ్బును ఎలా తిరిగి పొందవచ్చో తెలుసుకోండి. ఆర్పీఐ రూల్స్ ప్రకారం డిజిటల్ సేవల ద్వారా తప్పు వ్యక్తికి డబ్బు పంపినట్లయితే చెల్లింపు పత్రాలను ఉపయోగించి ఫిర్యాదు చేయాలి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇతర యూపీఐ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపితే ఎన్‌పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. npci.org.in వెబ్‌సైట్‌కి వెళ్లి వివాద పరిష్కార మెకానిజం ట్యాబ్ కింద ఫిర్యాదు చేయాలి. కంప్లైంట్ ఎంపికపై క్లిక్ చేసి యూపీఐ ఐడీ, వర్చువల్ చెల్లింపు చిరునామా, బదిలీ చేసిన మొత్తం, లావాదేవీ తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి సమాచారంతో ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపాలి. అలాగే మీ ఖాతాలో కట్ అయిన మొత్తం వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు.
యాప్ మీ సమస్యను పరిష్కరించకపోతే బ్యాంక్, ఎన్‌పీసీఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అదే పద్ధతిలో డిజిటల్ ఫిర్యాదుల కోసం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ అంబుడ్స్‌మన్ అనేది ఫిర్యాదులను పరిష్కరించడానికి, డిజిటల్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసింది., మొబైల్ బ్యాంకింగ్‌లో సమస్యలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపులు వంటి సమస్యలతో కూడిన ఫిర్యాదులను అంబుడ్స్‌మన్ నిర్వహిస్తారు. తమ డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటున్న కస్టమర్లు సంబంధిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థతో నేరుగా తమ సమస్యలను పరిష్కరించుకోలేకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. ఇలా కుదరని పక్షంలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లలో కస్టమర్ కేర్ నుంచి సహాయం తీసుకోవచ్చు, అదే సమయంలో డబ్బులు వాపసు కోసం అభ్యర్థించవచ్చు.