BRS : బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. ఆరోజే ప్రకటించనున్న సీఎం కేసీఆర్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS : బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ రెడీ.. ఆరోజే ప్రకటించనున్న సీఎం కేసీఆర్?

 Authored By kranthi | The Telugu News | Updated on :14 August 2023,1:30 pm

BRS : తెలంగాణలో ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఈనేపథ్యంలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీలంటే తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్యనే గట్టి పోటీ నెలకొన్నది. ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ గెలుస్తుందా? లేక హంగ్ వస్తుందా? ఏం జరుగుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. కానీ.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హ్యాట్రిక్ సాధించి సౌత్ ఇండియాలోనే రికార్డు క్రియేట్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అంచనాలకు అందకుండా ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అధికారికంగా తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎందుకు ప్రకటించడం అని ఆగాయో తెలియదు కానీ.. కేసీఆర్ మాత్రం మిగితా పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టును ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ రెడీ అయిందట. ప్రస్తుతం అధిక శ్రావణ మాసం నడుస్తోంది కాబట్టి.. నిజ శ్రావణ మాసం ప్రారంభం కాగానే తొలి లిస్ట్ ను ప్రకటించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారట.

BRS party assembly candidates list ready

BRS party assembly candidates list ready

BRS : ప్రకటన ఎప్పుడు.. ఆగస్టు 17నా లేదా 19నా?

ఈనెల 17 నుంచే నిజ శ్రావణం ప్రారంభం కాబోతోంది. అంటే.. ఈనెల 17న లేదంటే 19న ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు బీఆర్ఎస్ పార్టీ తొలి లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలి లిస్టులో 80 మంది అభ్యర్థులు ఉంటారట. మిగితా అభ్యర్థుల లిస్టును మరోసారి ప్రకటిస్తారట గులాబీ బాస్. అందులో 80 శాతం టికెట్లు సిట్టింగ్స్ కే కేటాయించారని తెలుస్తోంది. మిగిలిన 29 స్థానాల్లో మాత్రం కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది