5 Lakh Scheme : స్పీడ్ పెంచిన కాంగ్రెస్ఇం.. ఇందిరమ్మ ఇళ్లు కోసం అర్హులైన వారికి రూ.5 లక్షల సహాయం.. ..!
ప్రధానాంశాలు:
5 Lakh Scheme : స్పీడ్ పెంచిన కాంగ్రెస్ఇం.. ఇందిరమ్మ ఇళ్లు కోసం అర్హులైన వారికి రూ.5 లక్షల సహాయం.. ..!
5 Lakh Scheme : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. ఆరు గ్యారంటీల అమలుకు సిద్ధమైంది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు కాగా.. పార్లమెంట్ ఎన్నికలకు ముందే మరికొన్ని గ్యారంటీలు అమలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. తెలంగాణలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, HUDCO రూ. రూ. 5000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. లబ్ధి దారులు ఎవరైతే ఉన్నారో వారికి గృహ నిర్మాణం సులభతరం చేసేందుకు ఈ పథకం అమలు చేస్తుందట. ఇది గృహనిర్మాణ కార్యక్రమాలలో ఒక మైలురాయిని సూచిస్తుంది అని చెప్పాలి. ఇచ్చిన వాగ్ధానాన్ని సకాలంలో నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పని చేస్తుంది.
5 Lakh Scheme : అర్హులైన వారికి ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్లు పథకం ఊపందుకోవడంతో అర్హులైన లబ్ధి దారులు ఈ ప్రయోజనాన్ని గణనీయంగా పొందే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇండ్లు పథకం అమలుకు మద్దతుగా 5000 కోట్ల రుణంకి సంబంధించి హెచ్‌డీడీసీఓ సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి 850 కోట్లు ఇవ్వదలచింది. పథకం పొందదలచిన వారు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారి ఇళ్లను నిర్మించుకునే భూమిని కలిగి ఉండాలి. తెలంగాణ అంతటా అభివృద్ది జరిగేలా గృహాలని సాధికారిత చేసి సంవత్సరానికి సుమారుగా 4.50 లక్షల ఇళ్లను నిర్మించడం ఈ పథకం లక్ష్యంగా తెలుస్తుంది.
దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్థలం ఉన్న వారికి.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనుంది… స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను కూడా ప్రభుత్వం రూపొందించింది. తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ నమూనాలను తీర్చిదిద్దారు. తొలి విడతలతో అన్ని 90 వేల పైచిలుకు లబ్ధిదారులను గుర్తించారు. గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు