Gidde Rajesh : వినూత్న నిరసన రాష్ట్ర వికలాంగ అధ్యక్షు గిద్దె రాజేష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gidde Rajesh : వినూత్న నిరసన రాష్ట్ర వికలాంగ అధ్యక్షు గిద్దె రాజేష్

 Authored By ramu | The Telugu News | Updated on :25 March 2025,10:00 pm

Gidde Rajesh : అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా RTC  ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రాజధాని హైదరాబాదు కేంద్రంగా ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో అర్థనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ Gidde Rajesh బృందం ఉచిత ప్రయాణం కల్పించేంతవరకు ఉచిత హామీల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తమ పోరాటం ఆగబోదని వెల్లడి .అసెంబ్లీ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు 100 శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 15 నెలల పాలన పూర్తయిన నేటికీ వికలాంగులకు ఇచ్చిన ఉచిత ప్రయాణ సౌకర్య హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు .

Gidde Rajesh వినూత్న నిరసన రాష్ట్ర వికలాంగ అధ్యక్షు గిద్దె రాజేష్

Gidde Rajesh : వినూత్న నిరసన రాష్ట్ర వికలాంగ అధ్యక్షు గిద్దె రాజేష్

మంగళవారం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగులకు వెంటనే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాదు కేంద్రంగా ఉన్న మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సంఘం నేతలతో కలిసి అర్థనగ్న ప్రదర్శన తో వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడు భారతదేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజంపై చూపని వివక్ష తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్నారని ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆర్టీసీలో ఆడవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అట్టడుగున ఉండి దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు ఆయన కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో ఇచ్చిన ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే హామీని నేటికీ నెరవేర్చకుండా వెనకడుగు వేస్తున్న తీరు బాధాకరమని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు తమ తీరు మార్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ 6000 పెంచాలని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిట్టి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగించాలని ముఖ్యంగా రాబోయే పంచాయితీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని లేకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోపాల్ రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి నల్గొండ జిల్లా మహిళా నాయకురాలు గుండెబోయిన అలివేలు చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు వెంకన్న చండూరు మండల ఉపాధ్యక్షులు పలసగొని రవి మునుగోడు మండల ఉపాధ్యక్షులు ఒంటెపాక ముత్తయ్య చండూరు మండల యువజన విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ మునుగోడు మండలం నాయకులు ఈద పరమేష్ చండూరు మహిళా అధ్యక్షురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది