MP Raghunandan Rao : కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ది లేదు.. కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారన్న రఘునందన్
ప్రధానాంశాలు:
MP Raghunandan Rao : కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ది లేదు.. కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారన్న రఘునందన్
MP Raghunandan Rao : కుల గణన అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది..సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టినట్లు వెల్లిడించారు. కులగణనను చేపట్టినది వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి Revanth reddy అన్నారు. అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను సభలో ప్రవేశపెడుతున్నామని తెలిపారు. గతేడాది నవంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సర్వే జరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
![MP Raghunandan Rao కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ది లేదు కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారన్న రఘునందన్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/MP-Raghunandan-Rao.jpg)
MP Raghunandan Rao : కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ది లేదు.. కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారన్న రఘునందన్
MP Raghunandan Rao రఘు నందన్ ఫైర్..
డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజులు సమయం పట్టిందని, ఏడాదిలోపు సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు. లక్షలాది మంది వివరాలు సేకరించకుండానే కాంగ్రెస్ సర్కారు కులగణన సర్వే పూర్తి చేసింది. అలాంటి కులగణనపై మాట్లాడి పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తారా.. రాహుల్ జీ?’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు
ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రెడ్డి కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కి చిత్త శుద్ధి లేదు. తప్పులని కప్పి పుచ్చుకోవడానికి వారు ఇలా చేస్తున్నారు. సగం జనాభా ఉన్న బీసీలకి రెండే మంత్రి పదవులు ఇచ్చి జబ్బలు చరుచుకుంటున్నారని రఘునందన్ అన్నారు. తెలంగాణ మంత్రి వర్గంలో మైనారిటీలు ఎందుకు లేరో చెప్పాలని కూడా ఆయన పైర్ అయ్యారు. కులగణన పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారని దానిని కప్పి పుచ్చుకోవడానికే కుల గణన అని అన్నారు రఘునందన్