Konda Surekha : చిక్కుల్లో కొండా సురేఖ‌…భ‌గ్గుమంటున్న ఎమ్మెల్యేలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Konda Surekha : చిక్కుల్లో కొండా సురేఖ‌…భ‌గ్గుమంటున్న ఎమ్మెల్యేలు

Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంది.కొద్ది రోజుల క్రితం ఆమె స‌మంత‌, నాగ చైత‌న్య‌పై చేసిన ఆరోప‌ణ‌లు కొండా సురేఖ‌ని ఇర‌కాటంలో ప‌డేలా చేశాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ట్రోల్ చేశారని, దాని వెనక ఆ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఉన్నారంటూ.. ఆరోపిస్తూ చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 October 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Konda Surekha : చిక్కుల్లో కొండా సురేఖ‌...భ‌గ్గుమంటున్న ఎమ్మెల్యేలు

Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతుంది.కొద్ది రోజుల క్రితం ఆమె స‌మంత‌, నాగ చైత‌న్య‌పై చేసిన ఆరోప‌ణ‌లు కొండా సురేఖ‌ని ఇర‌కాటంలో ప‌డేలా చేశాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ట్రోల్ చేశారని, దాని వెనక ఆ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఉన్నారంటూ.. ఆరోపిస్తూ చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ కాట్రవర్సీ అయింది. సినిమా సెలబ్రిటీలతో కేటీఆర్‌కు లింక్స్ అంటూ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి అప్పటి నుండి కొండా సురేఖ వార్తల్లో ఉంటున్నారు.

Konda Surekha బిగిస్తున్న ఉచ్చు..

నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ కూల్చివేత నుండి మొదలైన మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ.. ప్రస్తుతం సొంత జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫ్లెక్సీ వివాదంతో ప్రత్యక్ష ఫిర్యాదుల దాకా వెళ్లింది. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. తమ తమ నియోజిక వర్గాల్లో జరిగే వ్యవహారాల్లో ఉద్దేశపూర్వకంగా కలగచేసుకుని తమకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని పలువు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీకి ఫిర్యాదు చేయడంతో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ పాలనపై విసుగు చెంది ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇచ్చారని, పది నెలల్లోనే ఆమె వైఖరితో పార్టీ కేడర్ డీమోరల్ కావడం బాధాకరంగా మారిందని ఆవేదన చెందారు.

Konda Surekha చిక్కుల్లో కొండా సురేఖ‌భ‌గ్గుమంటున్న ఎమ్మెల్యేలు

Konda Surekha : చిక్కుల్లో కొండా సురేఖ‌…భ‌గ్గుమంటున్న ఎమ్మెల్యేలు

రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించకుంటే జాతీయ స్థాయి వరకూ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.అందులో భాగంగానే ఎమ్మెల్యేలంతా కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఫిర్యాదు చేసినవారిలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఉన్నట్లు తెలిస్తోంది. ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యకలాపాలు వ్యక్తిగత వ్యవహారాల్లో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకోవడం నచ్చడం లేదని సదరు నాయకులు ఆరోపిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది