Viral Video : నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన జవాన్.. హాస్పిటల్లో పండంటి బిడ్డకు జన్మ
Viral Video : ఎంతో టెక్నాలజీ పెరిగింది.. ఎన్నో అద్బుతాలు జరుగుతున్నాయి. మనవ జీవనశైలీలో ఎన్నో మార్పులు వచ్చాయి. డబ్చులు ఉంటే చాలు ప్రతి అవసరం తీరుతుంది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఎక్కడో ఒక్కచోట కనీస అవసరాలు తీరక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ రవాణా సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఆపద వస్తే కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సింది. అనారోగ్యంతో బాధపడేవారు..
గర్భిణి స్త్రీలలను సరైన టైంలో హాస్పిటల్ కి చేర్చకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే..చాలా గ్రామాల్లో రోడ్లు.. రవాణా వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రెగ్నెంట్ స్త్రీల డిలివరీ సమయంలో నానా కష్టాలు పడాల్సివస్తోంది. ఎలాంటి వెహికల్స్ అందుబాటులో లేకపోవడంతో భుజాలపై మోసుకెళ్తున్నారు. ఇలా దేశంలో చాలా సంఘటనలే జరిగాయి. గర్భిణీ నొప్పుల తో బాధపడుతున్నపుడు హాస్పిటల్ కి తీసుకువెళ్లడానికి సరైన మార్గం లేక జవాన్లు ఆమెను మోసుకుంటూ ఆసుపత్రి కి తీసుకువెళ్లగా పండంటి బిడ్డ కు జన్మనిచ్చింది.
ప్రస్తుత అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ఛత్తీఘర్ లోని ఓ గ్రామంలో గర్భిణికి నొప్పులు రావటంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్లటానికి రోడ్లు, రవాణా సౌకర్యల లేకపోవడంతో భుజాలపై మోసుకెళ్లారు. నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళను పెట్రోలింగుకు వెళ్లిన సీఆర్పియఫ్ జవాన్ చూసి వెంటనే అడవి ఉన్న ప్రాంతం నుండి కిలోమీటర్లు మంచంపై పడుకోబెట్టి తన భుజంపై మోసుకుంటూ వెళ్లి ఛతీస్ఘడ్ లోని దంతెవాడ హాస్పిటల్ లో చేర్పించారు. వెంటనే వైద్యం అందించగా పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.