Viral Video : ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. ఏం కనిపెట్టాడో చూడండి.. టాలెంట్ కు ఫిదా కావాల్సిందే
Viral Video : ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా దాన్ని ఆచరణలో పెడితేనే అది సాధ్యం అవుతుంది. దానికి ఒక రూపం వస్తుంది. ఎందుకంటే.. టాలెంట్ ఉండగానే సరిపోదు. ఐడియా ఉండగానే సరిపోదు. దాని కోసం ఎంతో కష్టపడాలి. అయితే.. ఐడియా అనేది ఎవ్వరి సొత్తు కాదు. అది ఎవరికైనా ఒకటే. చిన్నపిల్లలు అయినా.. యూత్ అయినా.. ముసలివాళ్లు అయినా ఎవ్వరైనా సరే.. వాళ్లకు వచ్చిన ఐడియాపై పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు.అలా.. తమ ఐడియాలపై పని చేసి..
కష్టపడి ఎన్నో అద్భుతాలను సృష్టించిన వాళ్లను చాలా మందిని చూశాం. అందులో పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకోబోయేది కూడా ఓ పిల్లాడి గురించే. నిండా ఐదేళ్లు కూడా లేని ఓ బుడతుడి ఐడియాను చూసి నెటిజన్లు, స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు.ఓ బుడతడు.. చిన్న జేసీబీని కనిపెట్టాడు. ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కాలువల్లో మట్టిని తీయాలన్నా.. బురదను ఎత్తిపోయాలన్నా.. దాని కోసం చేతితో తీయకుండా..

boy unique innovation of jcb video viral
Viral Video : జేసీపీ లాంటి పరికరాన్ని కనిపెట్టిన బుడ్డోడు
ఈ చిన్న జేసీబీతో తీయొచ్చన్నమాట. పనికిరాని టైర్ ను తీసుకొని అలాగే పనికిరాని చిన్న చిన్న ఐరన్ బొంగులతో ఆ బుడ్డోడు ఈ జేసీబీని తయారు చేశాడు. వీడియోలో ఆ బుడ్డోడు బురదను ఎలా తీయాలో కూడా చూపించాడు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆ బుడ్డోడిని చూసి తెగ మెచ్చుకుంటున్నారు. వామ్మో.. బుడ్డోడు చూస్తే ఎంత లేడు కానీ.. భలే ఐడియా వేశాడు. సూపర్ బుడ్డోడా నువ్వు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Just Incredible pic.twitter.com/NoJSPTTkdP
— Amazing Innovations (@AmazingInnovat1) March 2, 2022