Viral Video : మనుషులే కాదు.. కప్పలు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలే.. ఎలాగో ఈ వీడియోలో చూడండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : మనుషులే కాదు.. కప్పలు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలే.. ఎలాగో ఈ వీడియోలో చూడండి

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 May 2022,12:00 pm

Viral Video : స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడేది ఎవరు అంటే ఏం చెబుతాం. మనుషులు అంటాం. నిజానికి.. ఈ ప్రపంచం మొత్తం మనిషి గుప్పిట్లో ఉంది. మనిషి ఏం చేస్తే అదే కరెక్ట్. కానీ.. ఈ విశ్వంలో మనుషులతో పాటు ఎన్నో రకాల జీవులు మనుగడ సాగిస్తున్నాయి. వాటన్నింటి కన్నా మనిషిదే ఆధిపత్యం. మనిషే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు.మనిషి సృష్టించిన ఎన్నో అద్భుతాలలో స్మార్ట్ ఫోన్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే.. ఆ స్మార్ట్ ఫోన్ కు మనిషి ప్రస్తుతం బానిస అయిపోయాడు. పొద్దున లేచిన దగ్గర్నుంచి..

రాత్రి నిద్రపోయే వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా ఈ జనరేషన్ ఉండలేదు. స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంటే అరచేతుల్లో ప్రపంచం ఉన్నట్టే.నిజానికి.. ఈ స్మార్ట్ ఫోన్ ను మనుషులు తప్పితే ఏ జీవి కూడా వాడదు. కానీ.. ఈ వీడియో చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే.. కప్పలు.. స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయాయి. బానిస అయిపోయాయి. చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని కప్పలు స్మార్ట్ ఫోన్ ను తదేకంగా చూస్తూ ఉంటాయి. ఆ ఫోన్ లో ఏదో వీడియో ప్లే అవుతూ ఉంటుంది.

frogs watching video in smart phone video viral

frogs watching video in smart phone video viral

Viral Video : కళ్లప్పగించి మరీ.. స్మార్ట్ ఫోన్ లో వీడియోను చూసిన కప్పలు

ఆవీడియోను కప్పలు ఎంతో సీరియస్ గా చూస్తూ ఉన్నాయి. ఇంతలో ఆ ఫోన్ ను అక్కడి నుంచి తీసేసేందుకు ఆ ఫోన్ ఓనర్ ప్రయత్నిస్తాడు. దీంతో ఓ కప్ప అతడి చేతిపై విరుచుకుపడుతుంది.అతడి చేయిని కరుస్తుంది. దీంతో అతడు ఆ ఫోన్ ను అక్కడే వదిలేస్తాడు. ఆ తర్వాత రెండు మూడు సార్లు ఆ ఫోన్ ను తీసుకోవడానికి ప్రయత్నించినా.. కప్పలన్నీ అతడి మీద విరుచుకుపడతాయి. దానికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. వామ్మో.. కప్పలు కూడా స్మార్ట్ ఫోన్ కు బానిసలు అయిపోయాయా అని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

https://twitter.com/rupin1992/status/1522496969863667712?s=20&t=hXf8s8pDl-8lWEr6NoYqrQ

 

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది