Viral Video : విద్యార్థులతో కుర్చీలు వేయించుకొని.. వరద నీటిని దాటుతున్న ఓ ఉపాధ్యాయురాలు..
Viral Video : ఉపాధ్యాయురాలు అంటే దైవం తరువాత గురువే మనకు దేవుడు అంటుంటారు. గురువు అంటే పిల్లలకు బోధనలు చేసి జ్ఞానం, విజ్ఞానం గురించి తెలియజేసే వారి గురువు.. పిల్లలకు పాఠాలను చెప్పి మంచి విషయాలను అందిస్తూ చెడుకు దూరంగా ఉంచి వారిని తీర్చిదిద్ది ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తారు గురువులు.. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కొందరు టీచర్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ ను తీసుకువచ్చి పిల్లల మీద రుద్దుతున్నారు. పిల్లల్ని కొడుతున్నారు. అలాగే కొందరైతే పిల్లల్ని హింసకి గురి చేస్తున్నారు. ఇలా ఉన్నది గురువుల పరిస్థితి. ఇలాంటి ఒక పరిస్థితికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు చాలా చోట్లలో నీరు ఆగి ఉండడం, అందరికీ తెలిసిన విషయమే. ఇండ్లలో స్కూళ్లలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఒక స్కూల్లో కూడా ఇలాగే నీరు ఆగి ఉన్నాయి. దానిలో నుంచి పిల్లలు ప్రతిరోజు స్కూల్ కి వెళ్తున్నారు. అయితే ఒక టీచర్ స్కూల్ లకు వెళ్లడానికి ,నీరు అడ్డంగా ఉండడం చూసి, వాటిని తాకకుండా వెళ్లాలి. అని ఆలోచించి అక్కడ చదువుతున్న విద్యార్థులను కొన్ని కుర్చీలను తీసుకువచ్చి, బయట నుండి స్కూల్ లోపలి వరకు వరుసగా వేయమని చెప్పింది. అయితే విద్యార్థులు అదే వరద నీటి లో తిరుగుతూ వాళ్లు ఆ కుర్చీలను వేశారు. అప్పుడు ఒకటి తర్వాత ఒకటి దాటుకుంటూ ఆమె లోపలికి వచ్చింది.
అయితే అలా దాటుతుండగా కింద పడపోయింది. అప్పుడు అందులో ఒక అమ్మాయి తనని కింద పడకుండా పట్టుకుంది. ఆ విద్యార్థి అప్పుడు వరద నీటిలోనే ఉన్నారు. ఇలా టీచర్ కుర్చీల ద్వారా వరద నీటిని దాటుతుండగా, దీనిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చెక్కర్లు కొడుతుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో మధుర జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ వీడియో పై అధికారుల వరకు చేరుకుంది. వారు దీనిపై మండిపడుతూ ఆమెను టీచర్ పోస్ట్ నుంచి తొలగించారు. చాలామంది ఇలాగే వింత విన్యాసాలు చేస్తూ పిల్లల్ని బలి చేస్తున్నారు.. అలాంటి వారికి కూడా ఇలాంటి గతినే పట్టించాలి. అంటున్న నేటి విజన్లు.
#ViralVideo
யார் யாருக்கு உதவி செய்வது!டீச்சருக்கு உதவிய மாணவர்கள் !!#UttarPradesh |Teacher Entering Flooded School, Students Hold Chairs ! pic.twitter.com/weIcpBukwa
— Johnson PRO (@johnsoncinepro) July 28, 2022