Modi – YS Jagan : మోడీ – జగన్ కలిసి పెద్ద స్కెచ్ తోనే దిగారుగా !
Modi – YS Jagan : ముందస్తు ఎన్నికలు అనేవి మనకు కొత్తేమీ కాదు. ఇదివరకు చాలా సార్లు ముందస్తు ఎన్నికలు జరిగాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన రాజకీయ పార్టీలు చాలావరకు గెలిచాయి. 2018 ఎన్నికల్లోనూ ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించారు. నిజానికి 2019 లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నా.. కేసీఆర్.. 2018 డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్లి గెలిచి చూపించారు. అందుకే.. ఇప్పుడు ఏపీలో జగన్ కూడా ముందస్తుకు వెళ్తారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు జగన్ కూడా ముందస్తుకు వెళ్తారు అంటున్నారు.
అందుకే అన్నట్టుగా సీఎం జగన్ కూడా ఢిల్లీలో మకాం వేస్తున్నారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ భేటీలో ముందస్తు ఎన్నికలపై కూడా సీఎం జగన్.. ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఏపీకి సంబంధించి అప్పుల పరిమితిని పెంచడం, ఎక్కువ రుణాలు ఇవ్వాలని ప్రధానిని సీఎం జగన్ కోరే అవకాశం ఉంది. దీనితో పాటు రాజకీయ చర్చలు కూడా ఉండే అవకాశం ఉంది.తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా దేశంలో మోదీ హవా వీస్తోందని, మోదీ మూడోసారి ప్రధాని అవడం ఖాయం అని చెప్పింది. అలాగే.. ఏపీలో వైసీపీ పార్టీ మూడో అతి పెద్ద పార్టీగా అవతరించబోతోందని, వైసీపీకి పార్లమెంట్ ఎన్నికల్లో 24 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పింది.
Modi – YS Jagan : టైమ్స్ నౌ సర్వే ఏం చెబుతోంది?
దీన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా దేశంలో మోదీ, ఏపీలో జగన్.. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందస్తుకు వెళ్తే ఎలా ఉంటుందని ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి సీఎం జగన్ 2023 లోనే ఎన్నికలకు వెళ్తారా? లేక పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతారా అనేది.