Good News : సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా రూ.5 లక్షలు ఇస్తున్న ఏపీ సర్కార్
ప్రధానాంశాలు:
Good News : సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా రూ.5 లక్షలు ఇస్తున్న ఏపీ సర్కార్
Good News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్య భద్రత కోసం మరో కీలక ముందడుగు వేసింది. 70 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి PMJAY వయో వందన పథకం కింద సంవత్సరానికి రూ. ఐదు లక్షల ఉచిత వైద్య సేవలు అందించబోతున్నట్టు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఈ పథకం ద్వారా పెద్దల ఆరోగ్య సంరక్షణ మరింత బలపడనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

Good News : సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా రూ.5 లక్షలు ఇస్తున్న ఏపీ సర్కార్
Good News : ఏపీలో ఉచితంగా సీనియర్ సిటిజన్స్ రూ.5 లక్షలు పొందే ఛాన్స్ ..
అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ (UDID) కార్డులు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. UDID కార్డు పొందడానికి ఎటువంటి సామాజిక లేదా ఆర్థిక ప్రమాణాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులు కూడా మీసేవ, గ్రామ సచివాలయం లేదా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని తమ హక్కులను పొందవచ్చని తెలిపారు. స్లాట్ బుకింగ్ చేసిన తరువాత నెల రోజులలోగా సర్టిఫికెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది ఈ పథకాలకు అర్హులుగా ఉండే అవకాశం ఉందని అంచనా. వృద్ధులు మరియు దివ్యాంగులకు ఈ విధమైన పథకాలు ప్రోత్సాహకరంగా ఉండడమే కాక, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. ప్రభుత్వ తాజా నిర్ణయాలు వయోవృద్ధులు మరియు దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయి.