Ayyanna Patrudu : చంద్రబాబు నాయుడు తీరుకు అయ్యన్నకు ఎంత కష్టం వచ్చిందో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ayyanna Patrudu : చంద్రబాబు నాయుడు తీరుకు అయ్యన్నకు ఎంత కష్టం వచ్చిందో..!

 Authored By anusha | The Telugu News | Updated on :17 January 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Ayyanna Patrudu : చంద్రబాబు నాయుడు తీరుకు అయ్యన్నకు ఎంత కష్టం వచ్చిందో..!

Ayyanna Patrudu : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరితో అయ్యన్న మండిపోతున్నారు. తనను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడమే కాకుండా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన అంటున్నారు. పార్టీలో జరిగే విషయాలను తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదు అని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ గా ఎక్కడినుంచో చంద్రబాబు సామాజిక వర్గ నేతలను నెత్తిన కూర్చోబెట్టుకోవడం ఏంటని ఆయన ఫైర్ అవుతున్నారు. టీడీపీలో చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల కేశినేని నాని పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే రాయపాటి రంగారావు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబుకు కమిషన్లు తప్ప ఏమి పట్టవని మండిపడ్డారు.

ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయ అయ్యన్నపాత్రుడు చంద్రబాబు పై సీరియస్ గా ఉన్నారు. దాడి వీరభద్ర రావు టీడీపీలో చేరితే సమాచారం కూడా అందించకపోవడం ఆయనకు జీర్ణం కావడం లేదు. పార్టీ వ్యవహారాల గురించి అధినేతతో మాట్లాడుదాం అనుకుంటే తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని అయ్యన్న ఆగ్రహిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన దామోదర సత్యం నియమించడం అయ్యన్న అతడి అనుచరులకు నచ్చడం లేదు. దీనిపై ఆరా తీయాలని చంద్రబాబును కలవద్దామనుకుంటే ఆపాయింట్మెంట్ కూడా దొరకటం లేదు. అలాగే తునిలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే అయ్యన్న దానికి వెళ్ళలేదు చంద్రబాబు విలువ ఇవ్వకపోతే బీసీలకు ఏం న్యాయం చేస్తారని అయ్యన్న అనుచరుల భేటీతో నిలదీసినట్లు సమాచారం.

ఒకపక్క సామాజిక న్యాయాన్ని సమానంగా అమలుపరస్తున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్నింట అగ్ర తాంబూలాలు ఇస్తుంటే చంద్రబాబు పార్టీలోని సీనియర్ బీసీ నేతల అవమానించడం దుర్మార్గం అంటున్నారు. అయ్యన్నకు కోపానికి మరో కారణం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి తన కుమారుడిని నిలపెట్టాలని అయ్యన్న అనుకుంటున్నారు. అయితే ఆ టికెట్ 100 కోట్ల బడ్జెట్ పెట్టే వారికి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో అయ్యన్న మండిపడుతున్నారు. చంద్రబాబు మాత్రం తన కుమారుడు లోకేష్ ఎన్నికల్లో గెలవకపోయినా రాజకీయంగా ప్రమోట్ చేసుకున్నారు. తనలాంటి బీసీ నేతలకు మోకాలాడుతున్నారని అయ్యన్న సీరియస్ అవుతున్నారు. బీసీలను అవసరానికి వాడుకొని తర్వాత పట్టించుకోకుండా ఉండటం చంద్రబాబుకు కరెక్ట్ కాదని అయ్యన్న సీరియస్ అవుతున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది