Chandrababu : చంద్రబాబు నాయుడు తలరాత డిసైడ్ చేయ్యబోతోన్న ACB కోర్టు !
Chandrababu : మీకు గుర్తుందా? కృష్ణా నది పక్కన ఉండవల్లి కరకట్టపై ఉన్న లింగమనేని రమేశ్ ఇంటికి సంబంధించిన కేసు చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. ఆ ఇంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కొన్నేళ్లు ఉన్నారు. ఆ ఇంటికి సంబంధించిన అటాచ్ మెంట్ వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఇంటిని అటాచ్ చేసేందుకు సీఐడీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.
దానికి సంబంధించిన విచారణ తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో జరిగింది. తీర్పును ప్రస్తుతానికి ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. క్విడ్ ప్రోకోకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబు పాల్పడ్డారని, అందుకే లింగమనేని రమేశ్ ఇంటిని అటాచ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా సీఐడీ అటాచ్ మెంట్ కోసం కోర్టు తలుపులు తట్టింది. కరకట్ట మీద చంద్రబాబు నివసిస్తున్న ఇంటిని అటాచ్ మెంట్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
Chandrababu : అమరావతిలో భూములిచ్చి లబ్ది చేకూర్చారా?
లింగమనేని రమేశ్ కు అమరావతిలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూములు ఇచ్చారని.. లబ్ది చేకూర్చారని సీఐడీ ఆరోపిస్తోంది. అలా అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడుతారంటూ సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతిలో భూములు ఇచ్చినందుకే.. కరకట్ట మీద ఉన్న తన ఇంటిని లింగమనేని రమేశ్.. చంద్రబాబుకు రాసిచ్చారని పిటిషన్ లో పేర్కొన్నది. అందుకే ఆ ఇంటిని అటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విన్నవించింది సీఐడీ. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎలా అటాచ్ చేస్తారంటూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. దీనికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సీఐడీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తీర్పును జూన్ 2కు కోర్టు వాయిదా వేసింది.