Chandrababu : చంద్రబాబుకు పట్టుకున్న ఓటమి భయం… కంచుకోటగా ఉన్న కుప్పం కూలేనా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : చంద్రబాబుకు పట్టుకున్న ఓటమి భయం… కంచుకోటగా ఉన్న కుప్పం కూలేనా…!!

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,1:00 pm

Chandrababu : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయబోతున్నారా…? కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారా…? అయితే టిడిపి వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలకు సమాధానం అవును అనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం తో పాటు మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేసేందుకు మరో సురక్షితమైన నియోజకవర్గాన్ని కూడా ఎంచుకొని పెట్టుకున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. తాను ఏ నియోజకవర్గం లో నిలబడితే గెలుస్తాడో అనే విషయాన్ని తెలుసుకునేందుకు మూడుసార్లు సర్వే కూడా చేయించాడట. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత టెన్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్స్ లో ఎప్పుడూ కూడా ఏ నియోజకవర్గంలో ఎవరిని దింపాలి అని ఆలోచించే చంద్రబాబు నాయుడు ఈసారి మాత్రం తనకు సురక్షితమైన నియోజకవర్గం ఏంటి అనేదానిపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇంతలా టెన్షన్ పడటం ఎప్పుడూ చూడలేదని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. నిజానికి కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు దాదాపు ఏడుసార్లు గెలవడం జరిగింది. ఇక ఆ నియోజకవర్గం టిడిపి పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. కానీ 2019లో కుప్పం నియోజకవర్గంలో టిడిపి అధికారం కోల్పోయింది.

ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పిటిసి మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. టిడిపికి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో గెలిచి టిడిపిని చావు దెబ్బ కొట్టింది. ఈ క్రమంలోని మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడుకి భయం పట్టుకుంది అని చెప్పాలి. అయితే 2019 ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు జరగబోయే 2024లో కూడా కుప్పం నియోజకవర్గం నుండి తామే గెలుస్తామని జగన్ మోహన్ రెడ్డి తో పాటు సీనియర్ నేత పెద్దిరెడ్డి సవాల్ విసరడంతో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మూడు నెలలకు ఒకసారి కుప్పం వెళ్లి అక్కడే ఉంటున్నారు. అయితే ఇప్పటివరకు కుప్పంలో ఏడుసార్లు గెలిచిన చంద్రబాబు నాయుడు అంతకు ముందు అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు కానీ ప్రస్తుతం ఆయన అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇక చంద్రబాబు సతీమణి సంక్రాంతి పండుగను కుప్పంలోనే జరుపుకుని పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలోని ఈ తరహా మార్పులను కుప్పం ప్రజలు చాలా ఆసక్తికరంగాను ఆశ్చర్యంగాను చూస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్సిపి ఈసారి కూడా అక్కడ జెండా ఎగరేస్తే రాజకీయపరంగా చంద్రబాబు కి అది చావు దెబ్బ అని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

అలాగని కుప్పం నియోజకవర్గం నుండి మరో అభ్యర్థిని నిలబెట్టి తాను తప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అలా చేస్తే ఓటమిని ముందే అంగీకరించినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గంతో పాటు మరో నియోజకవర్గం నుండి కూడా చంద్రబాబు పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే ఇలా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయడం ఇదేమో కొత్త కాదు. గతంలో టిడిపి స్థాపించిన ఎన్టీఆర్ కూడా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. అదేవిధంగా మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ లో కెసిఆర్ కూడా రెండు నియోజకవర్గాలలో పోటీచేసి గెలుపొందారు. ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే ప్లాన్ అమలు చేయనున్నట్లు టిడిపి వర్గాల నుండి సమాచారం వస్తుంది. అయితే కుప్పం నియోజకవర్గంలో తాను ఓడిపోతానని భయంతోనే మరో నియోజకవర్గం నుండి బాబు బరిలో దిగుతున్నారని కొందరు అంటున్నారు. ఈ నేపద్యంలోనే చంద్రబాబుకు ఈ సారి భయం పట్టుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది