Pawan Kalyan : ఏపీలో గ్రామ సభలు..పవన్ కళ్యాణ్ మార్క్ మార్పు మొదలైంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ఏపీలో గ్రామ సభలు..పవన్ కళ్యాణ్ మార్క్ మార్పు మొదలైంది..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 August 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : ఏపీలో గ్రామ సభలు..పవన్ కళ్యాణ్ మార్క్ మార్పు మొదలైంది..!

Pawan Kalyan : తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మార్పు అంటే ఏంటో చేసి చూపిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను అడిగితే ఒకసారి గెలిపించి చూద్దామని అనుకుని ఈ ఎలక్షన్స్ లో జనసేనకు ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. పవన్ మాటలు ఏమేరకు ప్రజల్లోకి వెళ్లుంటే పార్టీ పోటీ చేసిన 21 సీట్లకు 21 గెలిచి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఐతే గెలిచాం ఇంకేంటి అనుకోకుండా ప్రజలు తన మీద పెట్టిన బాధ్యతను సక్రమంగా చేస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పంచాయతీల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో రాష్ట్రమంతా కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేడు ఏపీ అంతా కూడా గ్రామ సభలు మొదలయ్యాయి. గ్రామాలకు ఏవేవి కావాలో ఏవి అవసరమో గ్రామ సభల ద్వారా ప్రజలు అధికారులను కోరే అవకాశం ఉంటుంది. కాలువలు, మరుగుదొడ్లు, రహదారులు ఇలా గ్రామాలకు అవసరమైన పనులు చేసేలా ప్రభుత్వానికి అర్జీ చేసేలా ఈ సభలు జరుగనున్నాయి. ఇలా ఊరి నడిబొడ్డున గ్రామ సభ జరగడం అది ఇంత పెద్ద ఎత్తున ఇదే మొదటిసారి.

Pawan Kalyan గ్రామీణాభివృద్ధికి పవన్..

అంతకుముందు కూడా గ్రామ సభలు ఉన్నా కూడా వైసీపీ అధికాం లోకి వచ్చాక వాటిని రద్దు చేశారు. పంచాయతీల స్థానంలో సచివాలయాలు రాఅ.. ప్రభుత్వ సిబ్బందికి బదులుగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఐతే వీటి వల్ల సర్పంచులు కూడా ఉత్సవ విగ్రహంగా మారిన పరిస్థితి వచ్చింది. అందుకే పంచాయతీ రాజ్ శాఖ డిప్యూఈ సీఎం పవన్ రంగంలోకి దిగారు. పాత పంచాయతీ విధానాన్ని మళ్లీ ప్రారంభించేలా గ్రామ సభల నిర్వహణ చేస్తున్నారు.

Pawan Kalyan ఏపీలో గ్రామ సభలుపవన్ కళ్యాణ్ మార్క్ మార్పు మొదలైంది

Pawan Kalyan : ఏపీలో గ్రామ సభలు..పవన్ కళ్యాణ్ మార్క్ మార్పు మొదలైంది..!

గ్రామాలకు ఏం కావాలో గ్రామ సభల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ప్రజల పన్ను ద్వారా కట్టిన సొమ్ము స్థానిక సంస్థల దగ్గరే ఉంటుంది కాబట్టి వాటికి కేంద్రం కాస్త నిధులు యాడ్ చేసి గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించే వారు. పవన్ కళ్యాణ్ వచ్చాక పల్లెల్లో కాస్త నమ్మకం పెరిగింది. గ్రామీణాభివృద్ధి మీద పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. వైసీపీ ప్రభువం స్థానిక సంస్థలను నిర్వార్యం చేయడంతో పంచాయతీ వ్యవస్థని పూర్తి గా పూర్వ వైభవం తెచ్చుకునేలా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. ఒక రకంగా ఏపీలో గ్రామాలకు ఇది మంచి తరుణమని చెప్పొచ్చు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది