Pawan Kalyan : వైఎస్ జగన్ వాడిన కారులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్ర‌యాణిస్తున్నారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : వైఎస్ జగన్ వాడిన కారులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్ర‌యాణిస్తున్నారా..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : వైఎస్ జగన్ వాడిన కారులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్ర‌యాణిస్తున్నారా..!

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి మంగ‌ళ‌వారం వెళ్లారు.. రెండో బ్లాక్‌లోని తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలించారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీగా పాటుగా ఎస్కార్ట్ వాహనం.. బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించినట్లు సమాచారం. మంగ‌ళ‌వారం రోజు గన్నవరం విమనాశ్రయం నుంచి క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్లారు.

Pawan Kalyan జ‌గ‌న్ కారు వాడుతున్నాడా..!

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కు కేటాయించింది. వైప్లస్ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. దీంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. క్యాంప్ ఆఫీసు వద్ద పవన్ కళ్యాణ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్ సాయితో కలిసి క్యాంప్ ఆఫీసును పవన్ కళ్యాణ్ పరిశీలించారు.క్యాంపు ఆఫీసును పరిశీలించిన అనంతరం ప‌వ‌న్ ప‌లు సూచ‌నలు చేసిన‌ట్టు స‌మాచారం. ఇక పై అంతస్తులో నివాసం.. కింద ఆఫీసు ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Pawan Kalyan వైఎస్ జగన్ వాడిన కారులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్ర‌యాణిస్తున్నారా

Pawan Kalyan : వైఎస్ జగన్ వాడిన కారులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్ర‌యాణిస్తున్నారా..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. త‌ను క‌మిటైన సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ అభివృద్ధి కోసం కృషి చేయ‌నున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో పవన్ క‌ళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా.. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా నియమితులయ్యారు. ఆయ‌న ఈ రోజు ప‌ద‌వీ బాధ్య‌త‌లు అందుకోనుండ‌గా, ఆ త‌ర్వాత త‌న ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేయ‌నున్నారు. ఇప్పుడు ప‌వ‌న్ రాజ‌కీయాల‌లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారా అని ప్ర‌తి ఒక్క‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది