దైవ దర్శనం అనంతరం గుడిలో ఎందుకు కూర్చోవాలి..?
daiva darshan ప్రతి ఒక్కరు దైవ సన్నిధానంలో దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా గుడి ఆవరణంలో ఒక చోట కాసేపు కూర్చొని వెళ్ళటం అనేది జరుగుతుంది. నిజానికి దైవ దర్శనం అనంతరం ప్రాకారంలో కూర్చున్న సమయంలో ఆ దేవుడి రూపాన్ని తలుచుకుంటూ పాత కాలంలో మన పెద్దలు ఒక మంత్రం జపించేవారు. అదేమిటంటే..!
“అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహంతే తవ సాన్నిధ్యం
దేహమే పరమేశ్వరం”
ఈ సమయంలో మనం దర్శనం చేసుకున్న ఆ దేవుడి రూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నిర్మలమైన మనస్సుతో ఈ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం చూసిన దేవుడి రూపాన్ని కళ్ళుమూసుకొని జ్ఞప్తికి తెచ్చుకోవటం ద్వారా.. ఆ తర్వాత దేవాలయం నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ రూపాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు… దీనినే దర్పణ దర్శనం daiva darshan అని కూడా అంటారు. మనస్సనే దర్పణంగా భావించి ఆ దివ్య మంగళ రూపాన్ని ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ.. ఇక ఈ ప్రార్థన భావం ఏమిటో చూద్దాం
“అనాయాసేన మరణం”
నాకు నొప్పి లేదా బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు..
“వినా ధైన్యేన జీవనం”
నేను ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా, నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు..
“దేహంతే తవ సాన్నిధ్యం”
మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా అనుగ్రహించు
“దేహమే పరమేశ్వరం”
ఓ ప్రభు నాకు ఈ కింది మూడు వరాలు ప్రసాదించమని నిన్ను ప్రార్దిస్తున్నాడు..
1. ప్రతిక్షణం నీ ప్రార్థనలతో గడిపే విధంగా నన్ను అనుగ్రహించు, నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకొనివెళ్ళు
2. ఎప్పుడు కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సిరి సంపదలు ఇవ్వమని అడగను. కానీ నాకు నీ ఉత్తమమైన సన్నిధానాన్ని అనుగ్రహించు
3. నాకు ఎప్పుడు కూడా నువ్వు సదా అండగా ఉంది. ఉత్తమమైన మార్గంలో పయనించేలా చూడు
పైన చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని పాటిస్తే ఖచ్చితంగా మనకు ఏమి కావాలో అవి మనం అడగకుండానే ఆ దేవదేవుడు అనుగ్రహిస్తాడనే విషయాన్నీ మర్చిపోవద్దు.