Allu Sirish : అల్లు కుటుంబంతో విభేదాలా.. అల్లు శిరీష్ ట్వీట్ వెనక ఉన్న అర్ధం ఏంటి?
Allu Sirish: అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు. అతని చివరి సినిమా `ఏబీసీడీ` రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఆ తర్వాత అను ఎమ్మాన్యుయేల్‌తో కలిసి సినిమా చేస్తుండగా, దీనికి సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అయితే శిరీష్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టడంతో శిరీష్ ఆయనకు సహకరిస్తూ అక్కడ కెరీర్ ని ప్లాన్ చేస్తున్నారా? అన్నది కూడా అర్థంకాని వ్యవహారంగా మారింది.
ఇదిలా ఉంటే అరవింద్ స్టార్ట్ చేసిన ఆహా ఓటీటీ సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంటోంది. వినియోగదారుల్ని ఆహా యాప్ ఇబ్బంది పెడుతోంది. యాప్ క్లోజ్ అవ్వడం. .మరికొంత మంది యూజర్లు ఒకేసారి రెండు పరికరాలకు లాగిన్ కాలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యల్ని ఉద్దేశించి ఓ యూజర్ శిరీష్ కి ట్విటర్లో ట్యాగ్ చేసాడు. దీంతో శిరీష్ రిప్లై ఇచ్చాడు. ఆహాతో తనకు సంబంధాలు లేవని.. దయచేసి కస్టమర్ కేర్ ని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేసాడు. ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ.. సాంకేతిక సలహాదారుగా అన్నయ్య బాబి.. అరవింద్ గారికే చెందుతాయని తెలిపారు.
allu sirish tweet about is aha
Allu Sirish : అల్లు ఫ్యామిలీలో సమస్యలా..!
శిరీష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. కుటుంబంలో అందరికీ ఆహాతో సంబంధాలుండగా.. తనకెందుకు ఆ బాధ్యతలు లేవని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తండ్రి స్థాపించిన `ఆహా` యాప్‌కి తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నట్లు శిరీష్ ఎందుకు ట్వీట్ చేశాడు..? అల్లు కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆహా సమస్యల్ని పరిష్కరించేది టెక్నికల్ టీమ్ కదా.. అందువల్ల తాజా సమస్యలపై రిలేటెడ్ టీమ్ కి శిరీష్ ఈ విషయాన్ని చెప్పారని మరి కొందరు అంటున్నారు.
@ahavideoIN @alluarjun @AlluSirish
Hello Team ,
I have been waiting for almost 2 Weeks for resolution no one has responded to support. Please check and reach me ASAP. pic.twitter.com/1CCx6wexNz— its_me_Shutterbug (@itsme_Kranthi) January 15, 2022