Anasuya : మీది మీరు చూసుకోండి.. కోట శ్రీనివాసరావుపై ఫైర్ అయిన అనసూయ
Anasuya : సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు ఒక్కోసారి చెప్పే విషయాలు, చేసే కామెంట్లు నెట్టింట్లో వివాదంగా మారుతుంటాయి. ఆ మధ్య బాలయ్య గురించి చెప్పిన విషయం, మొహం మీద కాండ్రించి ఉమ్మేశాడంటూ అనడం నెట్టింట్లో వివాదాస్పదంగా మారింది. అయితే మధ్యలో ఒకసారి అనసూయ ఎవరో తెలీదు అని కోట అన్నారు. ఈ మధ్య మళ్లీ మాట్లాడాడూ.. ఆవిడ మంచి నటి అని, చక్కగా హావభావాలు పలికిస్తారని, చక్కగా డాన్సులు చేస్తారని చెప్పిన కోట.. ఆవిడ వేసుకునే డ్రెస్సులు తనకు నచ్చవని అన్నారు.

anasuya bharadwaj fires on kota srinivasa rao
ఈ విషయంపై అనసూయ అంత ఎత్తున లేచింది. కోట శ్రీనివాసరావు పేరుని తీయకుండానే అనసూయ మండిపడింది. ‘రీసెంట్‌గా ఓ సీనియర్ నటులు నాపై కొన్ని కామెంట్స్ చేశారని తెలిసింది. ఆయన నా బట్టల గురించి మాట్లాడారు. అలాంటి అనుభవమున్న వ్యక్తి అలా నీచంగా మాట్లాడటం అనేది నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది. ఎలాంటి బట్టలు ధరించాలనేది వ్యక్తిగతం. అలా వృత్తిపరమైన పరిస్థితులను అనుసరించి అలా చేయవచ్చు. కానీ సోషల్ మీడియా అలాంటి వార్తలను ప్రచారం చేస్తుంది. ఒక వేళా ఆ కాలంలోనే సోషల్ మీడియా ఉండుంటే.. ఆ సీనియర్ నటుడు మందు తాగుతూ, అధ్వానమైన దుస్తులను ధరించి, వెండితెరపై స్త్రీలను కించపరిచిన వాటిని ప్రశ్నించేదా? అని ఆశ్చర్యమేస్తుంది.
Anasuya : కోటపై మండిపడ్డ అనసూయ

anasuya bharadwaj fires on kota srinivasa rao
పెళ్లి చేసుకున్నారో, పిల్లలను ఉన్న స్టార్ హీరోలు సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారో, షర్టులు వేసుకోండా వారి బాడీని చూపించే వారిని ప్రశ్నించరు. కానీ నాలాంటి వాళ్లను మాత్రం ఇలా ప్రశ్నిస్తుంటారు. పెళ్లై, ఇద్దరు పిల్లలున్నా కూడా వృత్తిలో విజయాన్ని సాధించడానికి ఎంతో కష్టపడుతున్నాను. మీ అభిప్రాయాలను ప్రజలకు చెప్పడం కంటే మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి అంటూ మండిపడింది.