Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఎట్టకేలకి ఆదివారం (సెప్టెంబర్ 1) సాయంత్రం గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది.. ఓపెనింగ్ ఎపిసోడ్ లో భాగంగా స్టార్ హీరోయిన్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్ లు అదిరిపోయాయి. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ను ఆడియెన్స్ కు పరిచయం చేశారు. షో రంజుగా ఉండాలంటే కంటెస్టెంట్స్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. అందుకే సీజన్ 8 కోసం పవర్‌ఫుల్ కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు. మరి వారు […]
ప్రధానాంశాలు:
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
Bigg Boss 8 Telugu : బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఎట్టకేలకి ఆదివారం (సెప్టెంబర్ 1) సాయంత్రం గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది.. ఓపెనింగ్ ఎపిసోడ్ లో భాగంగా స్టార్ హీరోయిన్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్ లు అదిరిపోయాయి. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ను ఆడియెన్స్ కు పరిచయం చేశారు. షో రంజుగా ఉండాలంటే కంటెస్టెంట్స్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. అందుకే సీజన్ 8 కోసం పవర్‌ఫుల్ కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు. మరి వారు ఎవరు, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టగా ఇందులో యష్మీ గౌడ కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి, కన్నడలో అనేక సీరియల్స్‌లో నటించింది.
Bigg Boss 8 Telugu ఏడు జంటలుగా..
నిఖిల్ – సీరియల్ నటుడు, అభయ్ నవీన్ దర్శకుడు, నటుడు. పెళ్లి చూపులు సినిమాతో పాపులర్ అయ్యాడు, ప్రేరణ కంభం – కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్. ఆదిత్య ఓం – నటుడు, దర్శకుడు. లాహిరి లాహిరి లాహిరి సీరియల్‌తో పాపులర్ అయ్యారు. సోనియా ఆకుల – ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘కరోనా వైరస్‌లో నటించింది. బెజవాడ బేబక్క – సోషల్ మీడియా సెలబ్రిటీ, యూట్యూబర్చ, శేఖర్ బాషా..ఆర్జే, లావణ్య-రాజ్ తరుణ్ ఇష్యూలో రాజ్ తరుణ్‌కి అండగా నిలబడ్డాడు. కిర్రాక్ సీత – యూట్యూబర్, నటి. బేబీ సినిమాతో పాపులర్ అయ్యింది. నాగ మణికంఠ – సీరియల్ నటుడు, యూట్యూబర్ పృథ్వి రాజ్- ‘నాగ పంచమి’ సీరియల్ నటుడు. విష్ణు ప్రియ – డాన్సర్, యాంకర్, నటి. నైనిక – ఢీ షోతో పాపులర్ అయ్యింది.
నబీల్ అఫ్రిది – వరంగల్ యూట్యూబర్. ఈ 14 మందిని ఒక్కొకరిగా కాకుండా ఇద్దరిద్దరు చెప్పున జంటలుగా హౌస్‌లోకి పంపారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌ని ఏడు జంటలుగా హౌస్‌లోకి పంపించారు.ఎవరు ఎవరితో జంటగా వెళ్లారంటే.. మొదటి జంట.. యష్మీ గౌడ-నిఖిల్, రెండో జంట .. అభయ్ నవీన్ – ప్రేరణ కంభం, మూడో జంట.. ఆదిత్య ఓం – సోనియా ఆకుల, నాలుగో జంట.. బెజవాడ బేబక్క- శేఖర్ బాషా, ఐదో జంట.. కిర్రాక్ సీత- నాగ మణికంఠ, ఆరో జంట.. పృథ్విరాజ్- విష్ణు ప్రియ, ఏడో జంట.. నైనిక- నబీల్ అఫ్రిది. రెండు పెయిర్లు హౌస్‌లోకి వెళ్లిన అనంతరం.. ‘35 చిన్న కథ కాదు’ మూవీ టీమ్ కాసేపు సందడి చేసింది. ఈ టీమ్‌ని హౌస్‌లోకి పంపి.. చిన్న గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో ఓడిపోయిన వారి పేరిట ఓ బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈసారి బిగ్ బాస్‌లో కెప్టెన్ ఉండరు, ఇమ్యూనిటీ పవర్ ఉండదు అని ప్రకటించి షాక్ ఇచ్చారు.