Prashanth Neel : బ్లాక్ థీమ్ తో మెంటలెక్కిచ్చేస్తున్నారు.. ఇదేం, ఐడియా సార్..?
Prashanth Neel : సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడిదీ ఒక్కో స్టైల్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలన్ని భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్నాయి. మాటల మాంత్రీకుడు త్రివిక్రం సినిమాలంటే సంచులకొద్దీ పంచులుంటాయని..చిన్న మెసేజ్ ఉంటుందని ఫిక్సైపోవాల్సిందే. వి వి వినాయక్ అంటే గాల్లో సుమోలు లేవడాలు భారీ ఫైట్స్ ఉంటాయని డిసైడవచ్చు. కొరటాల శివ అంటే సోషల్ మెసేజ్ తప్పనిసరి. ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే హీరోను మాస్‌గా చూపించడంలో, హీరోయిన్‌ను అందంగా చూపించడంలో తిరుగులేదు.
హీరో మేనరిజం, డైలాగ్ డెలివరీ యూనిక్ అంతే.ఇక అనిల్ రావిపూడి సినిమా అంటే జంధ్యాల గారు గుర్తు రావాల్సిందే. ఇలా ఒక్కో దర్శకుడు తమదైన శైలిలో సినిమాలను చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇదే వరుసలో ఎవరితోనూ పోల్చుకోలేని విధంగా ఓ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో సినిమాలను తీస్తూ చిన్న కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా ఊహించని స్థాయికి చేరుకున్నారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఓ థీమ్ ఉంటుందని అందరూ ఫిక్సైయ్యేలా క్రియేట్ చేసుకున్నాడు.
Prashanth Neel : సెంటిమెంటా..లేక ఎంచుకున్న కథా నేపథ్యం అలా ఉంటుందా ..?
ఇప్పటి వరకు వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్, అండ్ 2 అంతకముందు వచ్చిన ఉగ్రం సినిమాలను బ్లాక్ థీం నేపథ్యంలో తెరకెక్కించి సంచలనం సృష్ఠించాడు. అయితే, ఇదే ప్రశాంత్ నీల్ బ్రాండ్ అయిపోయింది. ఆయన ఏ హీరోతో సినిమా చేసినా ఈ బ్లాక్ థీంతోనే మేకింగ్‌లో ఒక ప్రత్యేకమైన సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇది ఆయన సెంటిమెంటా..లేక ఎంచుకున్న కథా నేపథ్యం అలా ఉంటుందా అనేది తెలియదు గానీ, ప్రభాస్‌ను, తాజాగా ఎన్.టి.ఆర్ 31 సినిమాను ఇదే బ్లాక్ థీంతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే, సలార్ సినిమా పోస్టర్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు ఎన్.టి.ఆర్ 31 లుక్ రిలీజై అంతటా హాట్ టాపిక్‌గా మారింది.