Jabardasth : 100 నుండి 30… జబర్దస్త్ ను మరింత కుదించారు
Jabardasth : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పటికి కూడా గుర్తుంచుకునే షో జబర్దస్త్ అనడంలో సందేహం లేదు. దాదాపు పది సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్న ఈ షో ముందు ముందు కనిపించకుండా పోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. గతంలో మాదిరిగా ఈటీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూడటం లేదట. అందుకే ఈ షో ను గతంలో ఉన్నంత నిడివి ఇప్పుడు ఉండటం లేదు అంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ షో లో ఉన్న కమెడియన్స్ మరియు జడ్జ్ ల విషయంలో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఇంతకు ముందులా కాకుండా మారుతూ ఉన్నారు. మంచి టీమ్స్ లేవు. ప్రత్యేక టీమ్.. స్పెషల్ స్కిట్ అంటూ కొందరితో నవ్వించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఇప్పటికి కూడా జబర్దస్త్ అంటే ఇష్టపడే వారు ఉన్నారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం వస్తున్న రేటింగ్ అనడంలో సందేహం లేదు. ఒక మోస్తరుగా రేటింగ్ వచ్చినా కూడా నిడివి తగ్గించడం విమర్శలకు తావిస్తుంది.
జబర్దస్త్ ఆరంభం అయిన సమయంలో ఒకొక్క స్కిట్ కు పది నుండి పన్నెండు పదమూడు నిమిషాలు ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు. అయిదు ఆరు నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. ఒక వేళ మరీ బెస్ట్ అనుకుంటే తప్ప ఏడు నిమిషాలు ఇవ్వడం లేదు. జబర్దస్త్ ఆరంభంలో ఈటీవీలో ఏకంగా గంటన్నరకు పైగానే షో టెలికాస్ట్ అయ్యేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యాడ్స్ పోను కేవలం 30 నుండి 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మరీ ఇంత తక్కువ నిడివి ఏంటి భయ్యా అంటూ జబర్దస్త్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జబర్దస్త్ కు మంచి రోజులు వచ్చే పరిస్థితి లేదా అంటూ అభిమానులు ఆవేదనతో ఉన్నారు.