kajal aggarwal : పుట్టబోయే బిడ్డ కోసం.. ఆసక్తికర సంగతులు చెప్పిన కాజల్ అగర్వాల్..!
kajal aggarwal : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ తన ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు గర్భవతి అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండగా, . న్యూ ఇయర్ సందర్భంగా కౌజల్ భర్త గౌతమ్ కిచ్లు ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు కాజల్ కూడా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొస్తుంది.
kajal aggarwal న్యూ వర్కవుట్స్ స్టార్ట్…
పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ అగర్వాల్ కొత్త వర్కవుట్స్ చేయడం మొదలు పెట్టింది. ప్రెగ్నెంట్ లేడీస్ చేసే వ్యాయామాలు చేయడం స్టార్ట్ చేశారు. “prenatal journey (గర్భం దాల్చిన సమయంలో మహిళలు తీసుకునే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు) స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది” అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇటీవల ప్రెగ్నెంట్ కిట్ ప్రమోషన్‌లో కూడా కాజల్ అగర్వాల్ తన ప్రెగ్నెన్సీకి సంబంధించి హింట ఇచ్చింది.

kajal aggarwal pregnant TIps
సినిమాల విషయానికి వస్తే.. ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఉమ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ మూవీ విడుదలకు సన్నద్ధమవుతుంది. ఇందులో తానొక మిస్టీరియస్ అమ్మాయి పాత్రలో కనిపించనుంది కాజల్. ఇదొక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా. పెళ్లి తర్వాత కాజల్ నటించిన చిత్రం చిరంజీవి ‘ఆచార్య’. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతుంది. అలాగే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ అయిన ఇండియన్ 2లోనూ కమల్ హాసన్‌తో ఈమె కలిసి నటించింది.ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కాగా, ఇందులో కాజల్ నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
View this post on Instagram