Krishna Vamsi Prabhas : చేస్తే ప్రభాస్ తో చేయాలి.. లేదంటే లేదు.. కృష్ణవంశీ ఇలా మెలిక పెట్టారేంటి..?
ప్రధానాంశాలు:
Krishna Vamsi Prabhas : చేస్తే ప్రభాస్ తో చేయాలి.. లేదంటే లేదు.. కృష్ణవంశీ ఇలా మెలిక పెట్టారేంటి..?
Krishna Vamsi Prabhas : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలు అంటే ఒకప్పుడు చాలా పాపులర్. ఆయన సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు ఆయన క్రియేటివిటీ అంతా పోయింది. అసలేమాత్రం ఫాం లో లేని కృష్ణవంశీ లాస్ట్ ఇయర్ రంగమార్తాండా సినిమా తీశారు. ఆ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఆయన అది నిరాశ పరచింది. ఐతే ఈమధ్య మురారి రీ రిలీజ్ టైం లో సోషల్ మీడియాలో సందడి చేసిన కృష్ణవంశీ ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.
ప్రభాస్ తో చక్రం తీసిన కృష్ణవంశీ అప్పటికి ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ తో ఒక మంచి మాస్ కథ రాసుకున్నానని.. కాకపోతే ప్రభాస్ మాస్ మూవీ వద్దు క్లాస్ కావాలని అడిగాడని అన్నారు. అందుకే చక్రం తీశానని చెప్పారు కృష్ణవంశీ. ఐతే ఇప్పటికే ప్రభాస్ కోసం అనుకున్న ఆ కథ అలానే ఉందని. అతను మాత్రమే ఆ కథ చేయగలడని అన్నారు కృష్ణవంశీ.
Krishna Vamsi Prabhas పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీ బిజీ..
ఐతే ఇప్పుడు ప్రభాస్ కృష్ణవంశీకి ఛాన్స్ ఇచ్చే సీన్ కనిపించట్లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన సినిమా అంటే నేషనల్ లెవెల్ ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. అలాంటిది ప్రభాస్ కృష్ణవంశీతో సినిమా చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. ఐతే ప్రభాస్ కోసం ఎదురుచూడకుండా వేరే హీరోతో ఆ సినిమా చేస్తే బెటర్.

Krishna Vamsi Prabhas : చేస్తే ప్రభాస్ తో చేయాలి.. లేదంటే లేదు.. కృష్ణవంశీ ఇలా మెలిక పెట్టారేంటి..?
లేదు ఒకవేళ ఆ కథకు పాన్ ఇండియా అప్పీల్ ఉంది అంటే ప్రభాస్ ని ఒప్పించి సినిమా తీస్తే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ కృష్ణవంశీ చేసిన చక్రం సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా అందులో సాంగ్స్, కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్నాయి.