Manchu Vishnu : మంచు విష్ణు మొత్తానికి మాట మీద నిలబడ్డాడు.. ‘మా’లో ప్రక్షాళన ఓవర్!
Manchu Vishnu : మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు చెప్పింది చెప్పినట్టు చేసి చూపించాడు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు సరిగ్గా అమలు చేస్తున్నాడని సభ్యులకు క్లారిటీ ఇచ్చాడు. మా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా కొత్త బాడీ ఏర్పాటు, దాని పనితీరుపై మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా తన తండ్రి మోహన్ బాబు హాజరయ్యారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కొత్త బాడీ ఏర్పాటయ్యాక తమ టీం తీసుకున్న నిర్ణయాలపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘గతేడాది ఆక్టోబర్ 13 నేను మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను.
ఎన్నికల్లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఎన్నికల టైంలో ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం పూర్తయ్యాయి. మాలో సభ్యులు కానీ వారిని తొలగించాము. సభ్యత్వం విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ‘మా’ భవనానికి రెండు ప్రతిపాదనలు పెట్టగా అందులో ఒకటి ఫిల్మ్ నగర్ సమీపంలో ఓ భవనం జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ కూల్చివేసి దానిస్థానంలో కొత్తది నిర్మాణం చేపట్టాలనుకున్నాం. దాని ఖర్చు నేనే భరిస్తాను.నటీనటుల కోసం బుక్ లెట్ తయారు చేసి నిర్మాతలకు అందజేశాను. ఇక సభ్వత్వం పొందాలనుకునే వారు కనీసం 2 సినిమాల్లో నటించడంతో పాటు అవి విడుదల కావాలి.
Manchu Vishnu : విష్ణు ఏడాది పాలనలో సాధించిన విజయాలు
క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనీసం 10 సినిమాలైనా చేసి ఉండాలి. 5 నిమిషాలు వారు వెండితెరపై కనిపించాలి. అసోసియేట్ మెంబర్స్‌కు ‘మా’లో ఓటు హక్కు ఇవ్వడం లేదు.సభ్యత్వం ఉన్న వారికే సినిమాల్లో చాన్సులు వస్తాయి. మాకు వ్యతిరేకంగా కార్యవర్గ సభ్యులు ఎవరైనా కామెంట్లు పెడితే సీరియస్‌గా తీసుకుని వారిని శాశ్వతంగా ‘మా’ నుంచి తొలగిస్తాం. త్వరలో మొబైల్ యాప్ ద్వారా నటులకు అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. సంక్రాంతి వరకు యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయి. మాలో సభ్యత్వం లేని వారికి ఆరోగ్య భీమా తీసేసాం. మరణించిన నటుడి కూతురికి నేను వ్యక్తిగతం సాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు విష్ణు.