Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి మాట్లాడకపోవడానికి కారణం చెప్పిన నారా లోకేష్
Jr NTR : పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఏపీలో చిచ్చు రేపుతుంది. ఒకవైపు థియేటర్స్ లో సినిమా సందడి చేస్తుంటే మరోవైపు ఈ సినిమా రాజకీయంగా రచ్చ రచ్చ అవుతోంది. పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని.. అందుకే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదని.. అలాగే పెరగాల్సిన ధరలను కూడా పెంచలేదని పవన్ అభిమానులు, విపక్ష నేతలు ఆరోపించారు. డీజే టిల్లు సినిమా టికెట్లను వంద రూపాయల వరకు విక్రయించారని.. కానీ పవన్ సినిమా అనే సరికి 35 రూపాలయకంటే ఎక్కువ ధరకు టికెట్లు అమ్మితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఏంటని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
వారికి చంద్రబాబు, నారా లోకేష్ కూడా మద్దతుగా నిలిచారు.భీమ్లానాయక్ సినిమా విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చంద్రబాబు. లోకేష్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.భీమ్లా నాయక్ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోందని..
Jr NTR : గరం అయిన లోకేష్..
తాను కూడా సినిమాని చూడాలని ఎదురు చూస్తున్నాను అన్నారు లోకేష్. వైఎస్ జగన్ ఒక పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను నాశనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని భిక్షాటన చేసే గిన్నెగా మారుస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.అయితే ఈ వ్యాఖ్యల తర్వాత పేర్ని నాని స్పందిస్తూ.. ఎన్టీఆర్ సినిమా గురంచి ఎన్నడు ఎందుకు మాట్లాడట్లేదని అన్నారు. దీనికి తాజాగా నారా లోకేష్ స్పందించారు. నాకు నచ్చిన సినిమా చూస్తాను. నచ్చితే ట్వీట్ చేస్తాను. నచ్చకపోయిన ట్వీట్ చేస్తే బాగోదని సైలెంట్‌గా ఉంటాను అని లోకేష్ అన్నారు. అయిన జగన్‌కి ఓటీటీకి, ఓటీపీకి కూడా తేడా తెలియదు అంటూ లోకేష్ మండిపడ్డారు.