Poonam Kaur : ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ధైర్యం మెచ్చుకున్న పూనమ్..అలా చేయోద్దంటూ ఫైర్
Poonam Kaur : ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె వేసే ప్రతి ట్వీట్‌పై, పెట్టే ప్రతి పోస్ట్‌పై నెటిజన్లు నిగూడార్థాలు వెతుకుతూ ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను, తన అభిప్రాయాలను ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు పూనమ్. సమాజంలో జరిగే అకృత్యాలు, సంఘటనల మీద మాత్రం తన గళాన్ని విప్పుతుంటారు. అందరినీ ప్రశ్నిస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ట్వీటే పూనమ్ కౌర్ వేశారు.పన్నెండో తరగతి చదువుతున్న అమ్మాయి ఆత్మ హత్య చేసుకున్న ఘటన మీద స్పందించారు పూనమ్. క్రైస్తవ మిషనరీలో చదివే లావణ్య అమ్మాయి..
అక్కడి వేధింపులను భరించలేక ప్రాణాలు తీసుకుంది. ఉరివేసుకొని చనిపోయింది. ఈ ఘటనపై తాజాగా పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు.మతమార్పిడిలపై నాడు గాంధీజి అభిప్రాయాన్ని షేర్ చేసిన పూనమ్.. వారు మతమార్పిడిని ఆశించి ఈ సేవను చేయకుండా ఉంటే ఎంతో బాగుండేది అని గాంధీజీ మాట్లాడినట్టుగా ఉన్న ఆధారాలను పూనమ్ కౌర్ చేశారు.అవసరాల కోసం సర్టిఫికేట్లలో మతాలను మార్చుకుంటున్న ఈ సమయంలో మతమార్పిడికి వ్యతిరేకంగా నిలబడిన ఆ అమ్మాయి ధైర్యానికి గర్విస్తున్నాను.. తన కోసం, తన కట్టుబాట్ల కోసం నిలబడ్డ ఓ అమ్మాయి ఈ రోజు తనకు తాను శిక్షను విధించుకుంది..
Poonam Kaur : పూనమ్ ఫైర్..
లావణ్య త్యాగం అందరికీ గుణపాఠంగా మారాలని కోరుకుంటున్నాను అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. కాగా, విడాకులపై ఇటీవల పూనమ్ చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. విడాకుల అనంతరం నిజంగా మగవారికి పెయిన్ ఉండదా? లేదంటే..ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు..ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు..వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సొసైటీ పక్షపాత ధోరణితో ప్రొజెక్ట్ చేస్తుందా.. ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా?” అని పూనమ్ రాసుకొచ్చింది.