Bigg Boss Telugu 7 : మళ్లీ రచ్చ చేసిన రతిక.. మూసుకొని ఉండు.. నన్ను ముట్టుకుంటావా? ప్రశాంత్‌పై రెచ్చిపోయింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : మళ్లీ రచ్చ చేసిన రతిక.. మూసుకొని ఉండు.. నన్ను ముట్టుకుంటావా? ప్రశాంత్‌పై రెచ్చిపోయింది

 Authored By kranthi | The Telugu News | Updated on :20 September 2023,12:00 pm

Bigg Boss Telugu 7 : నీకు తెలియనప్పుడు మూసుకొని కూర్చో… నువ్వు తీసినవని నేను అనలేదు. నేను అనలేదు.. నీకు అన్నీ తెలుసు.. అందరికీ తెలిసిపోయింది. చెప్పేసేయ్ అంటే నాకు ఎప్పుడు చెప్పినవు అంటూ ఎక్స్‌ట్రాలు చేస్తున్నావు అంటూ ప్రశాంత్ పై మరోసారి రెచ్చిపోయింది రతిక. నిజానికి ఇద్దరూ రెండో వారమే విడిపోయారు. ప్రశాంత్ ను అడ్డంగా బుక్ చేసిన రతిక మళ్లీ ప్రశాంత్ ను పట్టుకుంది. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలియదు అని ప్రశాంత్ అంటే తెలియనప్పుడు మూసుకొని కూర్చో అంటూ గట్టిగా వాదించింది రతిక.

rathika and prashanth fight in bigg boss telugu 7

#image_title

నేనంటా.. నేనంటా.. నీకు తెలియనప్పుడు మూసుకొని కూర్చో అంటూ కంటిన్యూగా రతిక.. ప్రశాంత్ పై ఫైర్ అయ్యింది. నీకు తెలియనప్పుడు నా గురించి కూడా మాట్లాడొద్దు అని రతిక అంటే నువ్వు అమ్మాయివి కాబట్టి వదిలేశాను కానీ.. ఒకవేళ నువ్వు అబ్బాయివి అయితే మామూలుగా ఉండదు వ్యవహారం. నీకు అప్పుడు నా సంగతి చూపించేవాడిని అని ప్రశాంత్ అంటాడు. దీంతో అవునా.. ఎదుటి వాళ్లు ఊరికే కూర్చొంటారు మరి అంటూ రతిక కూడా సీరియస్ అవుతుంది.

Bigg Boss Telugu 7 : ఏంది ఈ చిల్లర లొల్లి

నాకు అసలు ఇదంతా చిల్లర లొల్లిలా ఉంది అంటూ ప్రశాంత్ సీరియస్ అవుతాడు. చెప్పింది నీకు అర్థం అయిందా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లి అని ప్రశాంత్ అంటే.. నీకు ప్రాబ్లమ్ అయితే నువ్వు వెళ్లు అంటుంది రతిక. నాకు ఇక్కడే నిలుచోవాలనిపిస్తోంది. నువ్వు వెళ్లు.. చోటు నువ్వు వెళ్లి ఆడుకోపో అంటూ రెచ్చిపోతుంది రతిక. కొడితే అక్కడ పడతవు.. వేలు దించు.. దించి మాట్లాడు అంటూ ప్రశాంత్ అంటాడు. దీంతో చూసుకుందాం బయట అంటుంది రతిక. అయితే.. ఇదంతా శుభశ్రీ ఆడిస్తున్న టాస్క్. రతికతో గొడవ పెట్టుకోవాలని ప్రశాంత్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ తనకు టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజంగానే అది టాస్కా మరి లేక నిజంగానే వాళ్ల మధ్య గొడవ జరుగుతోందా అనేది తెలియదు. నువ్వు వెళ్లు అని చేయితో నెట్టేస్తారు ప్రశాంత్. దీంతో చేయితో నెట్టకు. ఇంకోసారి ముట్టుకుంటే బాగోదు అంటూ మరోసారి రతిక ఫైర్ అవుతుంది. మొత్తానికి వీళ్ల గొడవ చూసి కంటెస్టెంట్లు మాత్రం కాసేపు నవ్వుకున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది