Rocket Raghava : ఎన్ని ఆఫర్స్ వచ్చినా రాఘవ జబర్దస్త్ వీడిక పోవడంకు కారణం ఏంటో తెలుసా?
Rocket Raghava : జబర్దస్త్ ప్రారంభమై దాదాపుగా పది సంవత్సరాలు కాబోతుంది. జబర్దస్త్ ప్రారంభమైన సమయంలో జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు మరియు రోజా ఇప్పుడు లేరు, మరియు అనసూయ యాంకరింగ్ మొన్నటి వరకు చేసి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. ఇక కమెడియన్స్ ఎంతో మంది వచ్చారు.. పోయారు. కొంత మంది కొత్త వారు ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్లయినా కూడా రాకెట్ రాఘవ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ప్రతి వారం ఆయన స్కిట్ ఉంటూనే ఉంది. కొందరు టీం లీడర్స్ వస్తువు పోతూ ఉంటారు, కానీ రాకెట్ రాఘవ మాత్రం సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా జబర్దస్త్ షెడ్యూల్ మిస్ కాకుండా వస్తాడు. ఆయన ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా జబర్దస్త్ ఎపిసోడ్ ని వదిలేయలేదు.
అంతేకాకుండా ఇతర చానల్స్ నుండి రాఘవకి ఎన్నో ఆఫర్స్ వస్తాయి వస్తూనే ఉన్నాయి. అయినా కూడా రాఘవ ఇప్పటి వరకు ఏ ఒక్క ఆఫర్ కి మొగ్గు చూపి వెళ్లలేదు. ఈటీవీ మల్లెమాల వారు ఇస్తున్న రెమ్యూనరేషన్ కి దాదాపు రెండు రెట్ల ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామంటూ ఒక ప్రముఖ ఛానల్ ఆఫర్ ఇచ్చిందట, ఆ మధ్య ప్రముఖ వ్యక్తి కూడా రాకెట్ రాఘవను జబర్దస్త్ నుండి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడట. కానీ రాకెట్ రాఘవ మాత్రం డబ్బు ముఖ్యం కాదంటూ మల్లెమాలతో తన యొక్క బాండింగ్ కొనసాగిస్తున్నాడు. అతి త్వరలోనే జబర్దస్త్ 10 సంవత్సరాల పూర్తి చేసుకోబోతున్న విషయం తెలిసింది.

rocket raghava jabardasth journey 10 years in etv mallemala
దాంతో రాకెట్ రాఘవ అరుదైన రికార్డును తన పేరుతో రాసుకోబోతున్నాడు. పది సంవత్సరాలు కంటిన్యూగా చేసిన వ్యక్తి అంటూ రాకెట్ రాఘవ పై ఖచ్చితంగా మల్లెమాల వారికి ఈటీవీ వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఇష్టమైన జబర్దస్త్ కార్యక్రమం వదిలేందుకు ఆసక్తి లేదు అందువల్లే బయట నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ వల్లే తాను పొజిషన్లో ఉన్నానని కనుక ఇంకాస్త పొజిషన్ వస్తుందని జబర్దస్త్ ని తాను వదిలేయ లేను అంటూ ఉంటాడు. తన మీద పంచులు వేయించుకుంటూ నవ్వులు పంచుతున్న రాఘవ నిజంగా గ్రేట్ అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉంటారు.