Samantha : నువ్ నన్ను హర్ట్ చేశావ్.. నేను నిన్ను హర్ట్ చేశా!.. సమంత పోస్ట్ వైరల్
Samantha సమంత ప్రస్తుతం ఏ పోస్ట్ చేసినా కూడా దానికి అందరూ కొత్త కొత్త అర్థాలను వెదుకుతున్నారు. అసలే ఇప్పుడు నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం మంచి హీటు మీదుంది. అందుకే సమంత ఏం మాట్లాడినా కూడా విడాకుల విషయానికే లింకు పెడుతున్నారు. ఆమె తన ఇన్ స్టా స్టోరీలో పెడుతున్న పోస్ట్‌లను చూస్తుంటే పరోక్షంగా విడాకుల వ్యవహారం మీదే స్పందించినట్టు కనిపిస్తోంది. రోజూ ఏదో ఒక సూక్తి మాటలు చెబుతూ వస్తోంది.
సమంత సూక్తులు వైరల్ Samantha
ఇక తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పోస్ట్‌లు చూస్తే ఈ విడాకుల వ్యవహారం ఎందుకు తెర మీదకు వచ్చిందో చెప్పకనే చెప్పేసినట్టు అనిపిస్తోంది. ది లిటిల్ ప్రిన్స్ అనే సినిమాకు సంబంధించిన కోట్స్‌ను సమంత షేర్ చేసింది. ఇందులో ఆ పాత్రలు మాట్లాడుకునే మాటలను సమంత తన ఉద్దేశ్యంగా చెప్పినట్టు కనిపిస్తోంది. నేను నిన్ను హర్ట్ చేసి ఉంటాను.. నువ్ నన్ను హర్ట్ చేసి ఉంటావేమో బహుషా అని చెప్పుకొచ్చింది. వాటిని పరిశీలిస్తే అందులో నిగూఢ అర్థం తెలుస్తోంది.
ఇక ఇంకో పోస్ట్‌లో.. బహుషా మనిద్దరం ఒకరినొకరు హర్ట్ చేసుకుని ఉంటాం.. అని చెప్పుకొచ్చింది. ఇది మనకు ఎంతో క్లిష్టమైన పరిస్థితి.. వసంతంలోకి రావాలంటే.. చలికాలంలోని కష్టాన్ని భరించాల్సిందే.. అంటూ ఇలా రకరకాల పోస్ట్‌లు పెడుతోంది. దీన్ని బట్టి చూస్తే సమంత తన విడాకుల వ్యవహారాన్ని చెబుతూ.. నాగ చైతన్య గురించి పరోక్షంగా పోస్ట్‌లు పెట్టినట్టు కనిపిస్తోంది. అసలు ఈ విడాకుల రూమర్లపై ఎవరో ఒకరు కుండబద్దలు కొట్టినట్టు చెబితే గానీ ఆగేలా లేవు. క్లారిటీ వచ్చేలా లేదు.