Bigg Boss OTT Telugu : హమీదా, సరయు మధ్య గొడవ.. మధ్యలో ఇన్వాల్వ్ అయిన అడ్డంగా బుక్కయిన అఖిల్
Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ హౌస్ లో అసలు మజా స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అయి వారం కూడా కాలేదు కానీ.. అప్పుడే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు హాట్ హాట్ గా రుసరుసలాడుతున్నారు. కంటెస్టెంట్ల మధ్య గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. నిజానికి.. బిగ్ బాస్ కు కూడా కావాల్సింది అదే కదా.ఇప్పటికే హౌస్ లో అజయ్, అరియానా మధ్య ప్రేమ స్టార్ట్ అయింది. మరోవైపు ముమైత్ ఖాన్ కూడా అజయ్ పై ఇష్టం చూపిస్తోంది. మరోవైపు సరయు, హమీదా మధ్య గొడవ స్టార్ట్ అయింది. తనపై జోక్స్ వేస్తూ హమీదా ఫన్ చేస్తోందని సరయు ఏడుస్తుంది. దీంతో అఖిల్ మధ్య వచ్చి ఏమైంది అని అడుగుతాడు.
sarayu and hamida fight in bigg boss ott telugu
దీంతో నాకు మాట్లాడుతుంటే మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది. ఆ విషయంలో తను నాపై ఫన్ చేస్తోంది. వేరే వాళ్ల ముందు నా గురించి చెబుతూ నవ్వుకుంటోంది అంటూ అఖిల్ కు చెబుతుంది. ఇదే విషయంలో అఖిల్ తో సరయు మాట్లాడుతుండగా చూసి హమీదా.. అఖిలపై కూడా అరుస్తుంది.నిజానికి.. సరయు గత సీజన్ లో కూడా అంతే. మాట్లాడితే హైప్ గా మాట్లాడటం.. ఏమాత్రం ఆలోచించకుండా ఎదుటివారిని ఏది పడితే అది అనేయడం తనకు కామన్.
Bigg Boss OTT Telugu : ప్రతి చిన్న విషయానికి ఏడుస్తున్న హమీదా
అందుకే తను గత సీజన్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది.ఈసీజన్ లో కూడా తనను అదే కార్డును ప్లే చేస్తోంది. తను ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఎదుటివారు ఏమనుకుంటారు అనే విషయం గురించి ఆలోచించకుండా ఎదుటివారిని అనేస్తుంది. వాళ్లు ఏదైనా అంటే మాత్రం తట్టుకోలేక ఏడ్చేస్తోంది. కావాలని.. ఏడుపు అనే సెంటిమెంట్ ను సరయు వాడుకోవాలని అనుకుంటోందా అనే విషయాలపై ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు.మరోవైపు యాంకర్ శివతో కూడా సరయుకు పొసగడం లేదు. యాంకర్ శివతో ఇప్పటికే తనకు గొడవ అయింది. అదే విషయంలో ఇద్దరూ ఒకరిని మరొకరు నామినేట్ కూడా చేసుకున్నారు. చూద్దాం మరి సరయు ఓటీటీలో ఎన్ని వారాలు ఉంటుందో.