Senior NTR : మనవరాలు శ్రీదేవితో రొమాన్స్ చేయాలా? ఆ సినిమాకు శ్రీదేవితో నటించే ముందు సీనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు ఇవే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Senior NTR : మనవరాలు శ్రీదేవితో రొమాన్స్ చేయాలా? ఆ సినిమాకు శ్రీదేవితో నటించే ముందు సీనియర్ ఎన్టీఆర్ అన్న మాటలు ఇవే

 Authored By jagadesh | The Telugu News | Updated on :14 December 2021,7:00 pm

Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ సినీ జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త దారిని చూపించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని భారత్ కు పరిచయం చేశారు. ఆయన కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఆయనతో అప్పట్లో నటించాలని చాలామంది హీరోయిన్లు, ఇతర నటులు అనుకునేవారు.అతిలోక సుందరి శ్రీదేవితో కూడా ఎన్టీఆర్ చాలా సినిమాల్లో నటించారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

అయితే.. తొలిసారి శ్రీదేవి.. సీనియర్ ఎన్టీఆర్ తో బడిపంతులు సినిమాలనటించింది.బడిపంతులు సినిమాలో శ్రీదేవి.. సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించింది. అప్పుడు శ్రీదేవి చిన్నపిల్లే. కానీ.. తను 16 ఏళ్ల కంటే ముందే హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ సినిమాకు.. డైరెక్టర్ రాఘవేంద్రరావు… శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారట.

senior ntr comments on sridevi when he acted with her in movie

senior ntr comments on sridevi when he acted with her in movie

Senior NTR : బడిపంతులు సినిమాలో మనవరాలి పాత్రలో నటించిన శ్రీదేవి

అదే విషయాన్ని సీనియర్ ఎన్టీఆర్ కు చెప్పారట. తను మీకు మనవరాలిగా నటించింది అని కూడా చెప్పారట. దీంతో సీనియర్ ఎన్టీఆర్.. మనవరాలితో ఇప్పుడు రొమాన్స్ చేయాలా అని అన్నారట. ఆమె వయసు ఎంత అన్నారట. దీంతో 16 అని రాఘవేంద్రరావు చెప్పారట. సరే.. నా వయసు కూడా 16 కదా.. అంటూ ఓ నవ్వు నవ్వారట. అయినా నటించడానికి వయసు ఎందుకు. వయసు ఒక సంఖ్య మాత్రమే.. అని అన్నారట. అలా.. వాళ్ల కాంబో తెరకెక్కింది. అప్పటి నుంచి వాళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

Source : https://www.telugulives.com/telugu/2021/12/senior-ntr-about-sreedevi-movie/

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది