Sridevi Drama Company : ఓర్నీ మీ జబర్దస్త్ ఫ్రాంక్ లు ఆపండ్రోయ్..!
Sridevi Drama Company : తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్ తనదైన ముద్రను వేసింది. కామెడీ షో లు లేని సమయంలో జబర్దస్త్ ప్రారంభం అయ్యి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. జబర్దస్త్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా మారింది. కార్యక్రమాన్ని నిర్వహకులు.. హోస్ట్.. జడ్జ్.. కమెడియన్స్ ఇలా అందరు కలిసి ఒక సరైన దారిలో నడిపి సూపర్ హిట్ చేశారు. అద్బుతమైన జబర్దస్త్ ఇప్పుడు దారుణమైన పరిస్థితికి చేరింది. అందుకు కారణం మళ్లీ మళ్లీ అదే కామెడీ.. మళ్లీ మళ్లీ అదే ఫ్రాంక్ లు ప్రేక్షకులకు మొహం మొత్తే విధంగా స్వయంగా వారే విసుగు పుట్టించేలా చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు.
జబర్దస్త్ లో ఎన్నో చెత్త ఫ్రాంక్ లు చేసి.. ప్రోమోలుగా కట్ చేసి తూచ్ అంతా ప్రోమో కోసమే అని వందల సార్లు అన్నారు. తాజాగా అలాంటి ఫ్రాంక్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలు చేసి నవ్వుల పాలు అయ్యారు. ప్రోమోలో పూర్ణ ను ఇమాన్యూల్ టచ్ చేయడం.. రష్మి కళ్లు తిరిగి కింద పడటం ఇవ్వన్నీ కూడా ఫ్రాంక్స్. వాటిని చూసి మీరు నవ్వుకోండి అంటూ మద్యలో రామ్ ప్రసాద్.. ఆదిల సోది కామెడీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో మొన్నటి ఆదివారం వచ్చిన ఎపిసోడ్ కు సంబంధించిన ఫ్రాంక్ లు చాలా చెత్తగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.

Sridevi Drama Company comedy show frank videos goes viral
ఇలాంటి ప్రోమో ట్రిక్స్ ను చూసి. ఫ్రాంక్ ప్రోమో కు టెమ్ట్ అయ్యి షో లను చూసే రోజులు పోయాయి. జబర్దస్త్ నేర్చుకున్న పాఠాలను ఇప్పటికి అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా నేర్చుకుని సరైన దారిలో వెళ్లాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్ మరియు ఇతర ఈటీవీ షో లు మరీ దారుణమైన రేటింగ్ కు పడిపోయాయి. ఈ సమయంలో ఆ రేటింగ్స్ ను కాపాడుకోవాలంటే కావాల్సిన వారు లేకుండా పోయారు. కనీసం ఈ ఫ్రాంక్ లు ఆపి మంచి కామెడీని చేయండ్రా బాబు అంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.