Vishnu Priya : అక్కినేని అఖిల్ కండలు తిరిగిన దేహం.. మనసు పడ్డ యాంకర్ విష్ణుప్రియ
Vishnu Priya : అక్కినేని హీరో అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ కు మంచి విజయాన్ని అందించింది. ఇలా మొదటిసారిగా అఖిల్ ఒక విజయవంతమైన సినిమాని తన ఖాతాలో వేసుకోవడంతో తన తదుపరి చిత్రాల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమాతో బిజీగా ఉండే అఖిల్ తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అఖిల్ కండలు తిరిగిన బాడీతో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటో పై యాంకర్ విష్ణు ప్రియ స్పందించారు. అక్కినేని అఖిల్ కి సంబంధించి ఏ చిన్న ఫోటో సోషల్ మీడియాలో వచ్చిన ముందుగా ఈమె రియాక్ట్ అవుతుంది.
Vishnu Priya : అఖిల్ పోస్టుపై యాంకర్ విష్ణు ప్రియ
యాంకర్ విష్ణు ప్రియ ఎన్నోసార్లు బహిరంగంగా తను అఖిల్ ను పొగుడుతూ.. అఖిల్ ఉ అంటే వెంటనే పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు తెలిపింది. ఈ క్రమంలోనే అఖిల్ పోస్ట్ పై స్పందిస్తూ లవ్ సింబల్స్ తో మరోసారి తన ప్రేమను వ్యక్త పరిచింది.ఈ విధంగా అఖిల్ ఫోటో పై యాంకర్ విష్ణుప్రియ స్పందించడంతో పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు స్పందిస్తూ నువ్వు అఖిల్ అన్నని ఎంత కాక పట్టిన అతను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోడులే అంటూ తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.