ఇది మన ప్రజాస్వామ్యం… ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్యే అయ్యాడు
మన దేశం ప్రజాస్వామ్యం చాలా అద్బుతమైనది. కాని దానికి ఉన్న కొన్ని లొసగులను ఉపయోగించుకుని కొందరు దాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ అడ్డ దారిలో అధికారంను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తు ఉంటారు. ఎన్నికల్లో ఎవరికి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు విజేతగా నిలుస్తారు. ఒక్క ఓటు అధికంగా వచ్చినా కూడా గెలుపు వారిదే. కాని మన దేశంలోని ఒక అసెంబ్లీ నియోజక వర్గంలో నాలుగు వేల ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థికి 16 వేలు రాగా రెండవ స్థానంలో ఉన్న వ్యక్తికి 12 వేల ఓట్లు వచ్చాయి. కొన్ని టెక్నికల్ ఇష్యూల కారణంగా 12 వేల ఓట్లు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు.
తప్పుడు అఫిడవిట్..
2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో హెన్రీ సింగ్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి 16 వేలకు పై చిలుకు ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎరబోట్ కు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో హెన్రీ గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని రోజులకు హెన్నీ తన నామినేషన్ అఫిడవిట్ లో హై కోర్టులో ఉన్న కేసును చూపించలేదు అంటూ బీజేపీ నాయకుడు కోర్టును ఆశ్రయించాడు. తప్పుడు అఫిడవిట్ ఇచ్చి ఎన్నికల సంఘంను మోసం చేసినందుకు గాను ఆయనపై అనర్హత వేటు వేయడం జరిగింది. అయితే తనపై అనర్హత వేటు వేసినందున ఉప ఎన్నికలు నిర్వహించాలని హెన్రీ కోర్టును ఆశ్రయించాడు.
మళ్లీ ఎన్నికలు సాధ్యం కాదు..
హెన్రీ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలంటూ కోర్టుకు వెళ్లడంతో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరకు ఉప ఎన్నికలు నిర్వహించడం కుదరదు అంటూ తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు కూడా అదే తీర్పు ఇవ్వడంతో హెన్రీ తన పదవిని వదులుకోవాల్సి రాగా సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అంటూ కోర్టు ప్రకటించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సెకండ్ ప్లేస్ లో నిల్చున్న అభ్యర్థి ఎమ్మెల్యేగా ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇలా మన దేశంలోనే అవుతుందేమో అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.