Old Age Home : ఈమె స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ఆస్తి కోసం నా కడుపున పుట్టిన పిల్లలే మోసం చేసి ఆశ్రమంలో పడేశారు.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Old Age Home : ఈమె స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ఆస్తి కోసం నా కడుపున పుట్టిన పిల్లలే మోసం చేసి ఆశ్రమంలో పడేశారు.. వీడియో !

Old Age Home : ఆస్తి కోసం ఈరోజుల్లో సొంత వాళ్లే పగ వాళ్లు అవుతున్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపే కొడుకులు, కూతుళ్లు ఉన్న రోజులు ఇవి. సొంత వాళ్లు లేరు.. పగ వాళ్లు లేరు. ఈరోజుల్లో ఎవ్వరూ లేరు. అందరికీ డబ్బు కావాలి. డబ్బు కోసం సొంత వాళ్లను కూడా మట్టుబెట్టడానికి వెనుకాడటం లేదు. అలాంటి ఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. మనం కూడా చూశాం. తాజాగా ఓ వృద్ధురాలిని సొంత పిల్లలే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 August 2023,4:00 pm

Old Age Home : ఆస్తి కోసం ఈరోజుల్లో సొంత వాళ్లే పగ వాళ్లు అవుతున్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపే కొడుకులు, కూతుళ్లు ఉన్న రోజులు ఇవి. సొంత వాళ్లు లేరు.. పగ వాళ్లు లేరు. ఈరోజుల్లో ఎవ్వరూ లేరు. అందరికీ డబ్బు కావాలి. డబ్బు కోసం సొంత వాళ్లను కూడా మట్టుబెట్టడానికి వెనుకాడటం లేదు. అలాంటి ఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. మనం కూడా చూశాం. తాజాగా ఓ వృద్ధురాలిని సొంత పిల్లలే వృద్ధాశ్రమంలో చేర్పించారు. తనకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

తన భర్త చనిపోవడంతో కొడుకు దగ్గరే ఇన్ని రోజులు ఉండేది ఆ వృద్ధురాలు. కానీ.. కొన్నేళ్ల తర్వాత కోడలు, కొడుకుతో తనకు పడలేదు. దీంతో నేను వృద్ధాశ్రమం వెళ్లిపోతా అని కొడుకుకి చెప్పింది. దీంతో వెళ్లిపో అన్నాడు కొడుకు. దీంతో ఆశ్రమంలో చేరింది ఆ వృద్ధురాలు. కూతుళ్లు మాత్రం ఎన్నేళ్లని సాదుతారు. చివరకు ఆ వృద్ధురాలు ఆశ్రమంలో చేరాల్సిన పరిస్థితి. ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నా కూడా చివరకు తను ఆశ్రమంలో ఒంటరిగా ఎవరూ లేని దిక్కు లేని మహిళగా జీవించాల్సి వస్తోంది.ఆస్తి కోసం తన కడుపున పుట్టిన పిల్లలు వదిలేయడంతో ఆ వృద్ధురాలు ఎంతో బాధపడుతోంది. ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేశానని కానీ.. చివరకు తనను ఒంటరిగా వదిలేశారు అంటూ చెప్పుకొచ్చింది ఆ మహిళ.

own son and daughter joined mother in old age home

own son and daughter joined mother in old age home

Old Age Home : ఇప్పటి వరకు ఒక్క సారి కూడా కొడుకు చూడటానికి రాలేదు

రెడీ టు సర్వ్ అనే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఆ మహిళ తలదాచుకుంటోంది. ఇంతమంది పిల్లలు ఉండి.. తను చివరకు ఎవరూ లేని అనాథగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఆ మహిళ. నా దగ్గర ఉన్న ఆస్తిని కూడా లాక్కొని తనను ఆశ్రమానికి పంపించేరాంటూ ఆ వృద్ధురాలు కంటతడి పెడుతుంటే చూసి కన్నీళ్లు ఆగవు. డబ్బు కోసం ఇంత నీచాతి నీచమైన పనికి దిగజారుతున్న మనుషుల్లో ఇంకెప్పుడు మానవత్వం వస్తుందో వేచి చూడాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది