Ys Jagan : వైఎస్ జగన్ మరో ఛారిత్రాత్మక నిర్ణయం.. దేశంలోనే మొదటి సారి
Ys Jagan : ఇటీవలే ఏపీలో మున్సిపాలిటీ మరియు కార్పోరేషన్ లకు ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో వైకాపా సంచనల విజయాన్ని సొంతం చేసుకుంది. 99 శాతం మున్సిపాలిటీలు మరియు నూరు శాతం కార్పోరేషన్ లను గెలుచుకుంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పరిపాలన సౌలభ్యం కోసం అన్నట్లుగా మున్సిపాలిటీల్లో ఒక మున్సిపల్ చైర్మన్ తో పాటు ఇద్దరు వైస్ చైర్మన్ లను నియమించే జీవోను తీసుకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో ఒక చైర్మన్ మరియు ఒక వైస్ చైర్మన్ ఉండేవారు. కాని ఇకపై ప్రతి మున్సిపాలిటీలో కూడా చైర్మన్ మరియు ఇద్దరు వైస్ చైర్మన్ లు ఉండబోతున్నారు. అలాగే కార్పోరేషన్ లో కూడా ఒక మేయర్ మరియు ఇద్దరు డిప్యూటీ మేయర్ లు ఉండబోతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంను పార్టీ నాయకులు స్వాగతించారు. త్వరలోనే ఈ నిర్ణయం ను ఆర్డినెన్స్ రూపంలో తీసుకు రాబోతున్నారు.
Ys Jagan : పరిపాలన సౌలభ్యం కోసమే
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనతో అధికారులు ఆర్డినెన్స్ ను రెడీ చేస్తున్నారు. గవర్నర్ ఈ ఆర్డినెన్స్ కు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. గవర్నర్ ఆమోద ముద్ర పడ్డ వెంటనే కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ కౌన్సిలర్ లు చైర్మన్ మరియు వైఎస్ చైర్మన్ లను ఎంపిక చేసుకోబోతున్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మరింత పారదర్శకంగా పనులు జరగడంతో పాటు స్పీడ్ గా పనులు జరుగుతాయని ఈ సందర్బంగా వైకాపా నాయకులు అంటున్నారు. అనుభవం తక్కువ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అన్న వారు ఇప్పుడు ఏం అంటారని వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. త్వరలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధానం తీసుకు వస్తారేమో చూడాలి.