చంద్రబాబు మాటను నిజం చేస్తున్న జగన్.. రాజకీయం అంటే ఇదే కాబోలు
చంద్రబాబు నాయుడు ఎప్పుడు అనే మాట.. నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని. ఆ మాటలను నిజం చేసే విధంగానే ప్రస్తుతం బాబు విషయంలో జగన్ వ్యవహార శైలి ఉన్నట్లు తెలుస్తుంది. 1978 లో ఎమ్మెల్యే గా మంత్రిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. చెన్నారెడ్డి, అంజయ్య, విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాడు.
రాజకీయ జీవితంలో ఇదో కొత్తరకమైన అనుభవం అని చెపుతున్నారు. పైన చెప్పుకున్న ముఖ్యమంత్రులు ఒక రకమైన వైఖరితో ఉన్నవాళ్లు. చంద్రబాబుకు వాళ్లతో రాజకీయపరమైన విభేదాలు తప్ప ఏమి లేవు. ఒకరిద్దరు ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ జగన్ మాత్రం అలాలేదు . వైఎస్ తో ఉన్న విభేదాలు కూడా జగన్ మోహన్ రెడ్డి తో కొనసాగుతున్నాయి.
వడ్డీతో సహా చెల్లిస్తున్నాడా..?
గతంలో పదవిలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన కొన్ని చర్యలు వలన ఇప్పుడు బాగా ఇబ్బందులు పడాల్సివస్తుందట. అప్పట్లో కాంగ్రెస్ తో కలిసి జగన్ ను పదహారు నెలలు జైలుకు పంపించాడు బాబు. దీనితో ఇప్పుడు జగన్ తనకున్న అధికారాలను ఉపయోగించి దానికి తగ్గ లెక్కలు తేల్చుకునే పనిలో ఉన్నాడని కొందరు అంటున్నారు. మొదటి రెండేళ్లు బాబును అమరావతి చుట్టూ తిప్పిన జగన్, ఇప్పుడు కుప్పం కూసాలు కదిలించే పనిలో పడ్డట్లు తెలుస్తుంది.
రాబోయే రోజుల్లో బాబును కేవలం కుప్పంకే పరిమితం చేయాలనీ జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక పక్క అమరావతిని టార్గెట్ చేసిన జగన్, అదే సమయంలో కుప్పంలో కూడా వ్యూహం అమలుచేసాడు, దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు కుప్పంలో నామినేషన్ వేస్తే చాలు గెలిపిస్తారు అనే నమ్మకం ఉండేది, కానీ మొన్నటి పంచాయితీ ఫలితాలు చూశాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనితో వరసపెట్టి కుప్పం పర్యటనలు చేస్తున్నాడు బాబు.
రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నకాని, కుప్పంలో మాత్రం బాబు గెలిచి తీరాలి. అందుకే ఇప్పుడు చంద్రబాబు మొదటి ప్రయారిటీ కుప్పం అయ్యింది. ఎదో గెలిచాను అంటే కుదరదు, మంచి మెజారిటీ వస్తేనే బాబు సత్తా ఏమిటో తెలుస్తుంది. ఇదే ఆలోచనతో చంద్రబాబు కుప్పం మీద దృష్టి పెట్టాడు. ఇదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి..? మిగిలిన చోట్ల పార్టీని నడిపేది ఎవరు..? సరిగ్గా వైసీపీ కి కావాల్సింది కూడా ఇదే.. చంద్రబాబును అధినాయకుడు స్థాయి నుండి ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి తగ్గించటమే వైసీపీ యొక్క గొప్ప విజయమని ప్రజల్లోకి తీసుకోని వెళ్ళటమే వైసీపీ మైండ్ గేమ్ అని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు అన్నట్లు జగన్ లాంటి సీఎం ను ఎప్పుడు చూడలేదు అనేది నిజమే