Prawns Curry Recipe : ఘాటైన మసాలాలు లేని రుచిని పెంచే స్పెషల్ మసాలాతో రొయ్యల ఇగురు…!
ప్రధానాంశాలు:
Prawns Curry Recipe : ఘాటైన మసాలాలు లేని రుచిని పెంచే స్పెషల్ మసాలాతో రొయ్యల ఇగురు...!
Prawns Curry Recipe : ఈరోజు రొయ్యలతో ఒక రుచికరమైన టేస్టీ టేస్టీ ఇగురు రెసిపీని చూపించబోతున్నాను.. ఈ రెసిపీలో ఘాటుగాటుగా ఉండే మసాలాలు ఏవి యూస్ చేయమండి.. చాలా మైల్డ్ ఫ్లేవర్స్ తో కూరకి మరింత రుచిని పెంచే విధంగా మసాలాని తయారుచేసి ఇందులో యడ్ చేస్తున్నాను. మీరు కంపేర్ చేస్తే ఇది డబల్ టేస్ట్ ఉంటుందన్నమాట. అది కూడా ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా ఈ రొయ్యలు ఎలా చేసుకోవచ్చు చూసేద్దాం.. దీనికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, టమాటాలు, ఆయిల్ ,గరం మసాలా మొదలైనవి… తయారీ విధానం: స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. ఉల్లి ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి చీల్చుకున్న రెండు పచ్చిమిర్చి, ఒకరెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా వేగేలోపు ఇగురు కోసం మన స్పెషల్ మసాలాను తయారు చేసుకుందాం. దానికోసం 6 నుంచి 8 దాకా తొక్కావోలుచుకున్న వెల్లుల్లిపాయలు తీసుకోండి.
పెద్దవైతే ఆరు తీసుకోండి చిన్నవైతే 8 వెల్లుల్లిపాయలు తీసుకోవచ్చు. ఒక టీ స్పూన్ దాకా మిరియాల తీసుకోండి. ఒక జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు తీసుకోవాలి. కొంచెం మెత్తగా క్రష్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లోకి చిన్న రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కూడా వేసుకొని ఫైన్ పేస్ ల గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా. సో ఆ మసాలాని వేసి ఆయిల్ లో కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసేసి నూనె పైకి తేలేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గంటతో కలుపుతూ అడుగు పట్టుకోకుండా చూసుకోండి. ఈ టమాటా పేస్ట్ అనేది మగ్గుతున్నప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ తీసుకున్న ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మనం ఆల్రెడీ ఇందులోకి మిరియాలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట. సో ఇంతవరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి అరకేజీ దాకా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. తర్వాత అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి. ఈ రొయ్యల నుంచి వాటర్ అంతా ఊరి గ్రేవీలాగా బయటకు వస్తుంది.
రొయ్యల నుంచి వచ్చిన వాటర్ తోనే రొయ్యలనేవి చక్కగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. రొయ్య ముక్క ఉడికిపోయిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ ని వేసుకోండి. మనం చేసేది రొయ్యల ఇగురు కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు. నీళ్లు వేసిన తర్వాత బాగా కలిపి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మూత పెట్టుకుంటూ ఒక ఐదు పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో నిదానంగా ఉడికించండి.ఇక లాస్ట్ లో కొత్తిమీర అలాగే జస్ట్ ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోనీ స్టవ్ ఆపుకోవడమే..అంతే చాలా టేస్టీగా గుమగుమలాడే రొయ్యలు ఇగురు చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఇంట్లో ఈ ప్రాసెస్ లో నేను చెప్పినట్టుగా ట్రై చేయండి.