Hair Tips : పదే పది రోజుల్లో జుట్టును పొడవుగా చేసే… అద్భుతమైన రెమిడీ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : పదే పది రోజుల్లో జుట్టును పొడవుగా చేసే… అద్భుతమైన రెమిడీ!

Hair Tips : ఈ మధ్య చాలా మందికి జుట్టు రాలడం ఓ పెద్ద సమస్యగా మారింది. దీన్ని ఎదుర్కునేందుకు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటారు చాలా మంది. హెయిర్ షాంపూలు, డైలు, స్ప్రేలు, కండిషనర్లు, నూనెలు… ఇలా ఒక్కటేమటి సవాల7 వాడుతుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అయితే ఇవన్నిటికీ చెక్ పెడుతూ ఈ అద్బుతమైన చిట్కాను ఉపయోగించడం వల్ల పొడవాటి ఆరోగ్య కరమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. కేవలం మూడే మూడు పదార్థాలతో […]

 Authored By pavan | The Telugu News | Updated on :16 May 2022,7:00 am

Hair Tips : ఈ మధ్య చాలా మందికి జుట్టు రాలడం ఓ పెద్ద సమస్యగా మారింది. దీన్ని ఎదుర్కునేందుకు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటారు చాలా మంది. హెయిర్ షాంపూలు, డైలు, స్ప్రేలు, కండిషనర్లు, నూనెలు… ఇలా ఒక్కటేమటి సవాల7 వాడుతుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అయితే ఇవన్నిటికీ చెక్ పెడుతూ ఈ అద్బుతమైన చిట్కాను ఉపయోగించడం వల్ల పొడవాటి ఆరోగ్య కరమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. కేవలం మూడే మూడు పదార్థాలతో తయారు చేసే ఈ అద్భతమైన వంటింటి చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక స్పూన్ మెంతులు, ఒఖ స్పూన్ బియ్యం, ఒక స్పూన్ లవంగాలు తీస్కొని… గ్లాసుడు నీటిలో వీటిని వేయాలి. ఇవన్నీ బాగా ఉడికేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి. తర్వాత ఈ నీటని తలకు స్ర్పేలాగా చల్లుకుని గంట సేపటి తర్వాత తల స్నానం చేయాలి. మెంతి గింజలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. అంతే కాకుండా మెంతి గింజల్లో ఐరన్, ప్రోటీన్ లు అధికంగా ఉంటాయి.అలాగే ఫోలిక్ యాసిడ్, విటామిన్లు, ఎ, కె, సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ మెంతి టానిక్ పగిలిన, దెబ్బతిన్న, నిస్తేజంగా ఉన్న వాటిని బాగు చేస్తుంది.

amazing hair growth tips

amazing hair growth tips

బియ్యం నీళ్లతో పరిష్కరించలేని జుట్టు సమస్య లేదు. ఇంకా చెప్పాలంటే ఇది విటామిన్లు, అమైనో ఆమ్లాలు, జింక్, మెగ్నీషియం, విటామిన్ బి, సి వంటి ఇతర ట్రేస్ మినరల్స్ తో ఉంటుంది. అదనంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ కెమిస్ట్స్ లో ప్రచురింపబడిన అధ్యయనం ప్రకారం బియ్యం నీరు జుట్టు స్థితి స్థాపకతను మెరుగుపరుస్తుంది. ఈ హెయిర్ స్ప్రేను రెగ్యులర్ గా వాడటం వల్ల మీ జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా ఆరోగ్యంగా తయారవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే తల స్నానం చేసే ముందు ఈ హెయిర్ స్ప్రేని వాడటం అస్సలే మర్చిపోకండి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది